హాస్పిటల్‌లో అమితాబ్.. మూడు రోజులుగా..

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. లివర్ సమస్య కారణంగా మూడు రోజుల నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రత్యేక వైద్య బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యుల బృందం వెల్లడించింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆయన హాస్పిటల్‌కు వచ్చినట్లు తెలిపారు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అక్టోబర్ 11న బిగ్ బి తన 77వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు.

TV5 News

Next Post

భారీ కాన్వాయ్‌తో ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ రెడ్డి

Fri Oct 18 , 2019
హుజూర్‌నగర్‌ ఎన్నికల ప్రచారానికి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి భారీ కాన్వాయ్‌తో వెళ్లారు. ఆయనకు సూర్యాపేటలో పార్టీ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. పూలదండలు, గజమాలతో సత్కరించారు. హజూర్‌నగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ జెండా ఎగరబోతోందని రేవంత్‌ అన్నారు. భవిష్యత్‌లో సూర్యాపేటలోనూ కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందన్నారు రేవంత్‌ రెడ్డి.