బిగ్ బీ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – వైద్యులు

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజుల క్రితమే ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో అమితాబ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఐసీయూ తరహా సదుపాయాలు ఉండే గదిలో బిగ్‌బీకి ట్రీట్‌మెంట్ జరుగుతోంది. కాలేయ సంబంధ వ్యాధి కారణంగా అమితాబ్ హాస్పిటల్‌లో చేరినట్లు సమాచారం. ఐతే, అమితాబ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.

అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల సంచలన వివరాలు బయటపెట్టారు. తన కాలేయం కాలేయం 75 శాతం దెబ్బతిన్నదని అమితాబ్ తెలిపారు. టీబీ, హెపటైటిస్-బి వ్యాధుల నుంచి కోలుకున్నానని చెప్పారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సినిమాలు, టీవీ షోలలో చురుగ్గానే పాల్గొంటున్నారు. ఇటీవల 77వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం కౌన్‌బ‌నేగా క‌రోడ్ ప‌తి సీజ‌న్ 11తో అమితాబ్.. సూజిత్ సర్కార్ గులాబో సితాబ్ అనే చిత్రంలో న‌టిస్తున్నారు. బ్రహ్మాస్త్ర అనే చిత్రంలోను కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

TV5 News

Next Post

అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించని తల్లీబిడ్డలు

Sat Oct 19 , 2019
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జవసత్వాలు కోల్పోయినట్లుంది. అసలు పోరాటం చేయడాన్ని కూడా హస్తం పార్టీ మరిచిపోయినట్లుంది. 2 కీలక రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకోనట్లు కనిపిస్తోంది. అగ్రనాయకుల పర్యటనలు గానీ, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రసంగాలు గానీ కనిపించడం లేదు. ఏదో రాహుల్ గాంధీ తిప్పలు పడుతున్నా రు గానీ, సీనియర్లు […]