ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరచిన మట్టిలో మాణిక్యాలు..

ఐడియాలు పెద్ద వాళ్లకేనా మాకూ వస్తాయంటున్నారు ఈ మట్టిలో మాణిక్యాలు. చిట్టి బుర్రకు పదునుపెట్టి క్యారమ్స్ ఆడుకోవడానికి మట్టితోనే బోర్డు తయారు చేసుకున్నారు. కాయిన్స్ కోసం సీసా మూతల్ని సేకరించారు. నేనే గెలిచా.. నువ్వు ఓడిపాయావ్ అంటూ సంబరపడిపోతూ ఆడుకోవడం ఆనంద్ మహీంద్రాను కదిలించింది. ఆయన వాట్సాప్ వండర్ బాక్స్‌లోకి వచ్చిన ఓ అద్భుతమైన ఫోటోని అందరి కోసం షేర్ చేశారు. చిన్నారుల క్రియేటివిటీకి ముగ్ధుడైన మహీంద్రా భారత్‌లో ఊహాశక్తికి ఎటువంటి కొదవలేదన్న విషయానికి ఇదే రుజువు అంటూ రాసుకొచ్చారు. ఆలోచన ఉంటే ఆచరణ సాధ్యమే అని ఈ చిన్నారులు నిరూపించారు.

TV5 News

Next Post

మాజీ మంత్రి పీఏ ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో..

Sat Oct 12 , 2019
కర్నాటకలో మాజీ మంత్రి పరమేశ్వర PA రమేష్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. 2 రోజులుగా పరమేశ్వరకు చెందిన ఇల్లు, కాలేజీల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆస్తులకు సంబంధించిన కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకుని లావాదేవీలను విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలనే శనివారం రమేష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. బెంగళూరులోని ఓ యూనివరిసిటీ గ్రౌండ్‌లో చెట్టుకు ఉరి వేసుకుని రమేష్ సూసైడ్ చేసుకున్నాడు. అక్కడే కారు వదిలిపెట్టి […]