అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు ఈ నెల..

Aganwadi-teacher

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ కొనసాగతోంది. అనంతపురం జిల్లాలో మినీ అంగన్‌వాడీ వర్కర్స్, అంగన్‌వాడీ వర్కర్ప్, అంగన్‌వాడీ హెల్పర్స్ పోస్టులను భర్తీ చేస్తోంది అనంతపురం జిల్లా సెలెక్షన్ కమిటీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ అయింది. మొత్తం 513 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అనంతపురం, అర్బన్, కుడేరు, కళ్యాణదుర్గం, పనుకొండ, తాడిపత్రి ప్రాజెక్టులో దరఖాస్తుకు డిసెంబర్ 8 చివరి తేదీ కాగా, సీకేపల్లి, హిందూపూర్, రాయదుర్గం, కనేకల్, ఉరవకొండ, మడకశిర, శింగనమల, కంబదూర్ ప్రాజెక్టులకు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ. వీటికి వేర్వేరుగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. పూర్తి వివరాలకు https://ananthapuramu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 513.. అంగన్ వాడీ వర్కర్స్: 77.. మినీ అంగన్‌వాడీ వర్కర్స్: 31.. అంగన్‌వాడీ హెల్పర్స్: 405

TV5 News

Next Post

అమాంతంగా పెరిగిన 'హాక్ ఐ' యాప్‌ డౌన్‌లోడ్లు

Tue Dec 3 , 2019
హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతి గురిచేసింది. ఈ అమానవీయ సంఘటన తర్వాత యువతులు, మహిళల భద్రతపై అవగాహన నేర్పింది. ఆపద సమయాల్లో బంధువులు, స్నేహితులకు ఫోన్‌ చేసేకన్నా ముందుగా హాక్ ఐ మొబైల్‌ అప్లికేషన్‌లోని సేవ్‌ అవర్‌ సోల్‌ మీటను నొక్కితే చాలు అంటూ పోలీస్‌ శాఖ, టీవీ 5 ప్రచారం చేయడం సత్ఫలితాలనిస్తోంది. మొబైల్‌ ఫోన్‌లలో హాక్ ఐ యాప్‌ను డౌన్‌ లోడ్ చేసుకుంటున్నారు. […]