రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా..? : మేకతోటి సుచరిత

home-minister-sucharitha

దిశ ఘటనపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత ఫైర్‌ అయ్యారు. దిశ హత్యకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుంటే.. లైంగిక దాడికి పాల్పడిన వారిని రెండు దెబ్బలు కొట్టాలని పవన్‌ కళ్యాణ్ అనడం చూస్తుంటే..

ఆయన మానసిక స్థితి ఏంటో అర్థమవుతోంది అన్నారు. రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా..? అని ఆమె ప్రశ్నించారు. ప్రజా నాయకుడు అని చెప్పుకునే పవన్‌ ఇలాగేనా మాట్లాడేది అని మండిపడ్డారు. అసలు పవన్‌ ఇప్పుడు ఏ పార్టీతో ఉన్నారో చెప్పాలి అన్నారు హోంమంత్రి సుచరిత.

TV5 News

Next Post

పాము పగ.. తోక తొక్కాడని బైక్‌ని వెంబడించి..

Wed Dec 4 , 2019
అయ్యో దేవుడా.. చూసుకోకుండా బైక్‌ని పాము తోక మీదకి పోనిచ్చాను. అదేమో అసలే త్రాచు. నన్ను ఒదిలి పెడితే ఒట్టు. బైక్ స్పీడు పెంచి పారి పోతున్నా.. జర జరా పాకుతూ వెంబడించింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని చెమటలు పడుతున్నా స్పీడ్ పెంచాను. అయినా దాని పంతం నెగ్గించుకుంది. ఎగిరి బైక్ అందుకుంది. కాళ్ల వరకూ రావడంతో బైక్ వదిలేసి పారిపోయాను. సమయానికి ఊరిలో తెలిసిన వాళ్లు కనిపించారు. వాళ్లంతా […]