ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..

ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తన మంత్రివర్గం కూర్పుపై దృష్టి సారించారు. కేబినెట్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. కేబినెట్ లోకి ఎంతమందిని తీసుకుంటారు..ఎవర్నెవరు తీసుకుంటారో సస్పెన్స్ గానే ఉన్నా..కొత్త మంత్రులు మాత్రం వచ్చే 8న ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. అదే రోజున జగన్ సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు. 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ వెంటనే 11 గంటల 49 నిమిషాలకు ఏపీ తొలి కేబినెట్ సమావేశం అవుతుంది. అటు జూన్ రెండో వారంలో అసెంబ్లీ సమావేశాల సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాణ స్వీకారం అవగానే పరిపాలనపై ఫోకస్ పెట్టిన జగన్..రెండో రోజు అదే స్పీడు కంటిన్యూ చేశారు. సమీక్షలు, బదిలీలు, నియామకాలు, అవసరం లేని ఉద్యోగాలపై కొరడా ఝులిపిస్తు వరుస నిర్ణయాలతో జగన్ మార్క్ గవర్నెన్స్ చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో సీఎంవోలో సిఫార్సుల ద్వారా నియామకం జరిగినట్లు భావిస్తున్న 42 మందిని తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా అన్ని డిపార్ట్ మెంట్లపై సమీక్షలు నిర్వహిస్తానని ఇదివరకే ప్రకటించిన జగన్..అదే పంథాలో దూసుకెళ్తున్నారు. శనివారం నుంచి ప్రమాణస్వీకారం తర్వాత ఇక పాలనపై ఫోకస్ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శనివారం నుంచి శాఖల వారీగా జగన్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం ఆర్ధిక, రెవెన్యూ శాఖలపై రివ్యూ నిర్వహించనున్న జగన్..వచ్చే నెల 3న ఉదయం విద్యాశాఖ, మధ్యాహ్నం జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం గృహ నిర్మాణ శాఖపై సమీక్షిస్తారు. ఇక వచ్చే నెల 6న సీఆర్డీఏపై రివ్యూ ఉంటుంది.

మరోవైపు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సమీక్షించారు జగన్. అక్షయపాత్ర ఫౌండేషన్, ఉన్నతవిద్యాశాఖ అధికారులతో సమావేశమైన సీఎం..అన్ని ప్రభుత్వ పాఠశాలలో విప్లవాత్మకమైన మార్పులు తేవాలని సూచించారు. ప్రతి విద్యార్ధి గవర్నమెంట్ స్కూల్ లో చదివేందుకు ఆసక్తి చూపించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలన్నారు. ప్రస్తుతం ప్రాథమికంగానే సమావేశం నిర్వహించామని..తదుపరి పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అటు సీఎం జగన్ ను కలిసేందుకు ఉన్నతాధికారులు క్యూ కట్టారు. సర్వశిక్ష అభియాన్‌ SPD జె.శ్రీనివాస్‌, పంచాయతి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జవహర్‌ రెడ్డితో పాటు మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కరికాల వల్లవన్‌, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ మన్మోహన్ సింగ్‌, కమిషనర్‌ ప్రభాకర్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అలాగే తెలంగాణ IAS అధికారి శ్రీలక్ష్మి కూడా జగన్ తో సమావేశం అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story