వైసీపీ నాయకుల ఒత్తిళ్లు భరించలేక.. ఓ ఆశావర్కర్‌..

టీడీపీ కార్యకర్తలపై దాడులే కాదు.. ఒత్తిళ్లు ఆగడంలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఒత్తిళ్లు భరించలేక.. ఓ ఆశావర్కర్‌ ఆత్మహత్య యత్నం తీవ్రకలకలం రేపుతోంది. ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ.. వైసీపీ నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని తన సూసైట్ లెటర్‌లో ఆరోపించింది. వారి టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ పేర్కొన్నారు జయలక్ష్మి.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. తనను టార్చర్ పెడుతున్నారంటూ ఆశా వర్కర్ జయలక్ష్మి సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి ప్రయత్నించారు. పట్టణంలోని 30 వ వార్డు మాజీ కౌన్సిలర్‌ జజ్జవరపు జయలక్ష్మి ప్రస్తుతం ఆశావర్కర్‌గా పనిచేస్తున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ.. రాష్ట్ర మంత్రి పేర్ని నాని, వార్డు కౌన్సిలర్‌ మట్టా తులసి, ఏసు కుమారిల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపించింది.. దీనివల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ జయలక్ష్మి సూసైడ్‌ లెటర్‌లో పేర్కొంది.

ఈ ప్రభుత్వంలో ఒక ఆడదాని మీద ఇంత కక్ష కట్టిన వారికి చావు ఓ గుణపాఠం కావాలని లేఖ రాసారు జయలక్ష్మీ.. ఈ పరిస్థితి ఎవ్వరికీ రాకుండా కాపాడమని కోరుకుంటున్నా సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.. వీరి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె లేఖ రాసి నిద్రమాత్రలు మింగారు. తన భర్తను బాగా చూసుకోవాలంటూ కుటుంబసభ్యులకు ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు. తనను టార్చర్ పెడుతున్నవారిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని.. ఇలాంటివి ఎవరికీ జరగకుండా చూడాలని ఆమె తన లేఖలో కోరారు. వైసీపీ నాయకుల వేధింపుల వల్లే మానసిక ఒత్తిడికి గురై జయలక్ష్మి ఆత్మహత్యయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *