కళ్యాణ మండపంలో బాంబు పెట్టినట్టు ఫోన్‌కాల్‌..

చిత్తూరు జిల్లా సత్యవేడులో బాంబు ఫోన్‌కాల్‌ కలకలం సృష్టించింది. VMK కళ్యాణ మండపంలో మాజీ MPP మస్తాన్‌ పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బాంబు పెట్టినట్టు డయల్‌ 100 నెంబర్‌కు కాల్‌వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన డాగ్‌ స్క్వాడ్ బృందాలతో రంగంలో దిగారు. తెల్లవారుజాము నుంచి మండపంలో తనిఖీలు చేస్తున్నారు. బాంబు ఫోన్‌కాల్‌ గురించి బయటికి తెలియడంతో ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి.

ఓ వైపు స్వాతంత్ర్యదినోత్స వేడుకలు జరుగుతున్న సమయంలో బాంబు పెట్టినట్టు కాల్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఎవరైనా విద్రోహులు దాడులకు పాల్పడబోతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డయల్‌ 100 నంబర్‌కు ఫోన్‌ చేసిన నెంబర్‌ ప్రస్తుతం స్విచాఫ్‌ వస్తోంది. మొత్తానిక ప్రశాంతంగా ఉన్న సత్యవేడు ప్రాంతం బాంబు ఫోన్‌ కాల్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *