కేసీ కెనాల్‌కు గండి.. 200 క్యూసెక్కుల నీరు వృథా

కేసీ కెనాల్‌కు గండి.. 200 క్యూసెక్కుల నీరు వృథా

కడప జిల్లాలో కేసీ కెనాల్‌కు గండిపడింది. మైదుకూరుకు సమీపంలో కొండపేట ఛానెల్‌ ఒకటో కిలోమీటర్‌ వద్ద.... దాదాపు రెండు మీటర్ల మేర గండిపడింది. దీంతో 200 క్యూసెక్కులు నీరు వృథా అయింది. ప్రధాన కాలువ నుంచి కొండపేట ఛానెల్‌కు నీరు వదిలే తూము గేట్లలో ఒక గేటు విరిగిపోవడం వల్ల....గండిపడింది. నీటిని ఆపేందుకు రైతులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అటు కేసీ కెనాల్‌ అధికారులు సైతం అందుబాటులో లేకపోవడంతో.. ఈ నీరంతా... లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. దీంతో ఆందోళనకు చెందుతున్నారు ప్రజలు.

భారీ వర్షాల కారణంగా..... కేసీ కెనాల్‌కు నీరు వస్తుందన్న ఆనందంలో ఉన్న రైతులు.... ఇప్పుడు గండి పడటంతో ఆందోళన చెందుతున్నారు. నారుమళ్ల తయారుచేసుకున్నసంయంలో ఇలాం.. నీరంతా వృథా అయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అధికారుల నిర్లక్ష్యంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో... కేసీ కెనాల్‌కు గండిపడిందంటున్నారు రైతులు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.... కాల్వకు పడిన గండిని పూడ్చాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story