రివర్స్ టెండరింగ్‌ అంటున్నారు వాటి పరిస్థితి ఏంటీ..? - బుచ్చయ్య చౌదరి

రివర్స్ టెండరింగ్‌ అంటున్నారు వాటి పరిస్థితి ఏంటీ..? - బుచ్చయ్య చౌదరి

పోలవరం ప్రాజెక్టు పనులపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారితీసింది. త్వరితగతింగా పూర్తిచేయాల్సిన పోలవరం పనులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి విమర్శించారు. తమ పాలనలో 71శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు . పునరావాసం కోసం కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టును తర్వరితగతింగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు బుచ్చయ్య చౌదరి. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని శాసససభలో ప్రభుత్వం దృష్టి తీసుకువచ్చారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టు కట్టుకుంటూ పోతే .. దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇప్పటికే కృష్ణా,గోదావరిలో నీరు లేని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్‌ అంటున్నారు దాని విదివిధానాలు ఎంతవరకు వచ్చాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పోలవరం పనులను ఆపేశారనడం సరికాదని మంత్రి అనిల్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని టీడీపీ సభ్యులు పోలవరం పై పూర్తిస్థాయిలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఏపీ హక్కులను జగన్‌ ప్రభుత్వం తెలంగాణకు తాకట్టుపెట్టిందంటూ సభలో టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story