చంద్రబాబు ఇంటిని తాళ్లతో కట్టేసిన పోలీసులు

చంద్రబాబు ఇంటిని తాళ్లతో కట్టేసిన పోలీసులు

చంద్రబాబు నాయుడి నివాసంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి ఉదయం 8గంటలకే బయలుదేరాల్సి ఉన్నా.. పోలీసులు గృహనిర్బంధం కారణంగా ఇంటికే పరిమితం అయ్యారు. బాధితులకు అండగా ఇంట్లోనే చంద్రబాబు దీక్షకు దిగారు. అయితే నేతల అరెస్టులు, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు 11 గంటల సమయంలో భారీగా చేరుకున్న కార్యకర్తలు మధ్య ఆత్మకూరుకు బయలుదేరారు. అయితే గేటు ముందున్న పోలీసులు చంద్రబాబు కారును బయటకు రాకుండా గేటు మూసివేశారు. పెద్ద తాళ్లతో గేట్లు లాక్‌ చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడంపై నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష నేత ఇంటిని తాళ్లతో కట్టడం దుర్మార్గమన్నారు. పోలీసుల తీరును టీడీపీ నాయకులు తప్పుబట్టారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదన్నారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు చిన్నరాజప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్‌ ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story