బొత్స ప్రకటనతో అక్కడ జోరుగా రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌

బొత్స ప్రకటనతో అక్కడ జోరుగా రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌

అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యతిరేక ప్రకటనతో ఒక్కసారిగా ఏపీలో కలకలం మొదలైంది. అమరావతి ప్రాంత ప్రజల్లో గుండెల్లో గుబులు రేపగా... దొనకొండ వాసుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. మంత్రి ప్రకటన చేసిన కొన్ని గంటల్లోనే.. దొనకొండలో దిగిపోయారు రియల్టర్లు. భూముల రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. దొనకొండలో ఎకరం 60 లక్షల రూపాయలు పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరం ధరను 20లక్షలకు పెంచేశారు. భూముల ధర పెరిగినా.. కొనేందుకు పెద్దసంఖ్యలో అక్కడ వాలిపోయారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు. పలువురు రాజకీయ నాయకులు, వారి అనుచరులు. ప్రస్తుతం అక్కడ జోరుగా భూమి కొనుగోళ్ల లావాదేవిల్లో మునిగిపోయారు.

జగన్‌ వస్తే దొనకొండ రాజధాని చేస్తారంటూ.. 2014 ఎన్నికల ముందు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవడంతో.. రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు చంద్రబాబు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో.. మళ్లీ దొనకొండ మాట వినిపించడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా మంత్రి బొత్స చేసిన ప్రకటనతో.. దొనకొండకే జగన్‌ సర్కారు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దీంతో బొత్స ప్రకటన మరుసటి రోజునుంచే...దొనకొండలో మళ్లీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సందడి మొదలైంది.

మరోవైపు.. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనే నమ్మకంతో ఎన్నికల ముందునుంచే వైసీపీ నేతలు.. దొనకొండలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. రాజధాని అనే కాకుండా.. జగన్‌ అధికారంలోకి వస్తే దొనకొండకు ఏదో ఒకరకంగా ప్రాధాన్యం ఇస్తారన్న వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే వైసీపీ చెందిన పారిశ్రామికవేత్తలు కొందరు .. దొనకొండ ప్రాంతంలో భారీగా భూములు కొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఒంగోలుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త.. భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతే కాదు.. తన సన్నిహితులకు సైతం ఇక్కడ భూములు కొనేలా ప్రోత్సహించారు. అప్పట్నుంచే అక్కడ భూ లావాదేవీల్లో కదలిక మొదలైంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... దొనకొండలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. దొనకొండలో 30లక్షల రూపాయలు ఉన్న ఎకరం భూమి ధర ఏకంగా 40లక్షల రూపాయలకు చేరింది. సమీప గ్రామాల్లో ఎకరం ధర తిరిగి 10లక్షల రూపాయలకు చేరింది. గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దొనకొండ పరిసరాల్లో దాదాపు 40 ఎకరాలు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన మరికొందరు సైతం దొండపాడు గ్రామ సమీపంలో దాదాపు వంద ఎకరాల భూమిని కొనుగోలు శారు. గతంలో ఎకరా 10 లక్షల లోపు ఉన్న భూమిని.. వీరు 18లక్షల ప్రకారం కొనుగోలు చేసినట్లు సమాచారం. వీరితో .. ఆంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు ఇక్కడ భూముల కొనుగోళ్లలో పాల్గొంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story