ఆ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయడమే కరెక్ట్‌ : జేఎన్టీయూ నిపుణుల బృందం

ఆ అపార్ట్‌మెంట్‌ను కూల్చివేయడమే కరెక్ట్‌ : జేఎన్టీయూ నిపుణుల బృందం

కాకినాడలో కుంగిపోయిన భాస్కర్ ఎస్టేట్ అపార్ట్ మెంట్స్ నివాసయోగ్యం కాదని JNTU నిపుణుల బృందం తేల్చింది. నాణ్యతాలోపం వల్లే అపార్ట్ మెంట్ అంతా బీటలు వారిందని తెలిపారు. ప్రస్తుతానికి 3 పిల్లర్లు దెబ్బతిన్నాయని.. కానీ మిగతా పిల్లర్ల పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని స్పష్టం చేశారు....అయితే అపార్ట్ మెంట్ నిర్మించిన బిల్డర్ మాత్రం 2 వారాల గడవుకోరుతున్నాడు. ముంబయి నుంచి నిపుణుల బృందాన్ని పిలిపించి మరమ్మతులు చేయిస్తానని చెబుతున్నాడు... అయితే అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ...సాధ్యం కాదని JNTU నిపుణుల బృందం చెబుతోంది..బిల్డింగ్ ను కూల్చివేయడమే అన్ని విధాల శ్రేయస్కరం అంటున్నారు...

అటు ఈ అపార్ట్‌మెంట్ కుంగిన విషయంపై సీఎం జగన్ కూడా ఆరా తీశారు.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్‌రెడ్డి కుంగిన అపార్ట్‌మెంట్‌ను పరిశీలించారు..ఇప్పటికే ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్లందరినీ ఖాళీ చేయించామన్నారు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఐతే.. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని అపార్ట్‌మెంట్‌ వాసులు కోరారు. రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటే ఎక్కడికి వెళ్లగలమని వారంతా కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో.. ఫైర్ సిబ్బంది సాయంతో ఒక్కొక్కరిని లోపలికి పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అపార్టుమెంట్ కూల్చాల్సి వస్తే బిల్డర్ నుంచి తమకు పరిహారం ఇప్పించాలని బాధితులంతా డిమాండ్ చేస్తున్నారు.

కాకినాడ నగరం నడిబొడ్డున సినిమా రోడ్‌ను ఆనుకుని దేవీ మల్టీప్లెక్స్ ప్రక్కనే ఈ భాస్కర్ ఎస్టేట్స్ ఉంది. 13సంవత్సరాల క్రితం నిర్మించారు. ఒక్కో బ్లాక్‌లో 20 ఫ్లాట్ల చొప్పున మొత్తం 40 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ భవనానికి 60 పిల్లర్లు ఉంటే వాటిల్లో వెనుకభాగంవైపు ఉన్న 3 పిల్లర్లలో ఉన్నట్టుండి పగుళ్లొచ్చాయి. అవన్నీ దాదాపుగా ధ్వంసమైపోయాయి. కాంక్రీట్ మొత్తం పెచ్చులుగా ఊడిపోయి, ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. నిన్న సాయంత్రం ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే అపార్ట్‌మెంట్‌వాసులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీమ్‌లు.. పిల్లర్లను పరిశీలించి అపార్ట్‌మెంట్ ఖాళీ చేయాలని సూచించారు. దీంతో.. 40 కుటుంబాలు హుటాహుటిన సామాన్లన్నీ పట్టుకుని రోడ్డుపైకి వచ్చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story