వైసీపీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు..

వైసీపీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు..

ఏపీలో టీవీ-5, ABN ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ..రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో A.P.W.J, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నిజాల్ని చెబుతున్న మీడియా గొంతుని నొక్కడం సరికాదంటూ నేతలు మండిపడ్డారు. అనంతరం పుట్టపర్తి డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. వెంటనే టీవీ-5, ABN ఛానళ్ల ప్రసారాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు...

టీవీ-5, ABN ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ...కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ తీరుని నేతలు తప్పుపట్టారు..

ఏపీ సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ప్రజాసంఘాల నేతలు. టీవీ-5, ABN ఛానళ్లను నిషేధించడంపై తిరుపతి సీపీఐ ఆఫీసులో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అక్షరం జోలికి వస్తే ఎవరైనా సరే మంటగలసిపోతారని నేతలు హెచ్చరించారు.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదట భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు...

టీవీ-5, ABN ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లాలో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరుని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు..

కడప జిల్లా రైల్వేకోడూరులో విద్యార్థి సంఘాలు రెండో రోజూ నిరసనలు చేపట్టాయి.. తహసిల్దార్ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు..అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Tags

Read MoreRead Less
Next Story