పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ లో 58.53 కోట్లు ఆదా అయ్యింది : ఏపీ ప్రభుత్వం

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ లో 58.53 కోట్లు ఆదా అయ్యింది : ఏపీ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్ట్‌ రివర్స్ టెండర్లు మొదలయ్యాయి. లెఫ్ట్‌ కనెక్టివిటీ పనుల్లో 65వ ప్యాకేజీ టెండర్‌ ఖరారైంది. గతంలో 292.09 కోట్లకు ఈ పనులు దక్కించుకున్న మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ... తాజాగా 231.47 కోట్లకు కైవసం చేసుకుంది. బిడ్‌లో ఆరు కంపెనీలు పోటీపడ్దడాయి. అయితే 15.6 శాతం తక్కువ ధర కోట్‌చేసిన మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థకు టెండర్ దక్కింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో 58.53 కోట్లు ఆదా అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. రివర్స్ టెండరింగ్‌ సక్సెస్ అయిందని, గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని మరోసారి నిర్ధారణ అయిందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story