పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ

పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ

పోలవరం ప్రాజెక్ట్‌ రివర్స్‌ టెండరింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి 4వేల 987 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీ సర్కారు. ఈ నెల 19న బిడ్లను స్వీకరించనుంది. వచ్చే నలె 19 వరకు బిడ్‌ దాఖలుకు తుది గడువు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో 3వేల 600 కోట్ల మేర అంచనాలు పెరిగాయని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాజెక్ట్‌లో హెడ్‌వర్క్స్‌ మిగిలిన పనులకు 1,887 కోట్లు, హైడెల్ ప్రాజెక్ట్‌కు 3వేల100 కోట్లు కలిపి ఇనీషియల్ బెంచ్ మార్క్ కింద 4,900 కోట్లుగా నిర్ణయించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

2014లో ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకున్న మైనస్ 14 శాతానికి స్టాండెడ్ సర్వీస్ రేట్లు కలిపి 4వేల 987.5 కోట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలవరం ఎడమ కాలువ 65 ప్యాకేజీ పనులకు 275 కోట్ల అంచనాలతో నోటీఫికేషన్‌ ఇచ్చింది. సోమవారం నుంచి ఈ-టెండరింగ్ వెబ్‌సైట్‌లోకి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ అందుబాటులో రానుంది.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసుకున్న ఒప్పందాలను సమీక్షిస్తున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. పోలవరం ప్రాజెక్టుకు రీ టెండర్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇది సరైన నిర్ణయం కాదంటూ ప్రాజెక్టు అథారిటీ చేసిన సూచనలను సైతం పక్కనపెట్టారు. సెప్టెంబర్‌లోగా కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి నవంబర్‌ మొదటి వారం నుంచి శరవేగంగా పనులు చేట్టాలని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలని భావిస్తోంది ఏపీ సర్కారు.

Tags

Read MoreRead Less
Next Story