ఏపీ దేవాదాయశాఖలో ప్రకంపనలు

ఏపీ దేవాదాయశాఖలో ప్రకంపనలు

ఏపీ దేవాదాయశాఖలోొ ప్రకంపనలు మెుదలైయాయి. అక్రమార్కులపై దేవాదాయ శాఖ కొరడా ఝుళిపిస్తుడటంతో అడ్డదారుల్లో అందలమెక్కిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంతా జరుగుతున్నా కొందరు అధికారులు మాత్రం దింపుడు కళ్లెం ఆశలు వదులుకోవడం లేదు. మళ్లీ ప్రమోషన్ల ఫైల్ కదలడంతో... కోరిన పోస్టును దక్కించుకునేందుకు షరా మామూలుగానే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

కోరుకున్న ప్రమోషన్లు దక్కితే చాలన్నట్లు అడ్డగోలుగా వ్యవహరించారు కొందరు అధికారులు. పై నుంచి కూడా పుష్కలంగా అండదండలు ఉండటంతో ఇన్ని రోజులు వాళ్లు ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా సాగింది యవ్వారం. కానీ ఇప్పుడు వారి అవినీతినంతా తవ్వి తీస్తున్నారు. అడ్డదారిలో ప్రమోషన్లు పొందినవారికి ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. పదోన్నతి ఎలా పొందావు? ఏయే నిబంధనలు ఉల్లంఘించారు.? లాంటి వివరాలు మొత్తం తెలపాలంటూ తాఖీదుల్లో స్పష్టంగా పేర్కొనడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది.

ప్రస్తుతానికి దేవాదాయశాఖలోని ఎస్టాబ్లిష్ మెంట్ "ఈ" సెక్షన్ నుంచి నోటీసులు జారీ చేశారు. మిగిలిన వారికి తాఖీదులు పంపే బాధ్యతను "C" సెక్షన్ కు అప్పగించారు. వాస్తవానికి టెంపుల్ ఎంప్లాయిస్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ C సెక్షన్ చూడాలి. కానీ కొందరు ఉన్నతాధికారులు ఆ విధులను గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేసారు. ఇప్పుడు మళ్లీ ఆ అధికారాలు C సెక్షన్ పరిధిలోకి వెళ్లడం వారికి మింగుడు పడటం లేదు. త్వరలోనే మొత్తం 150 మందికి నోటీసులు పంపేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీముఖాలు అందుకున్న కొంత మంది.. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఇక ఈ వివాదం ఇలా సాగుతుండగానే.. దేవాదాయశాఖలో మళ్లీ కొత్త ప్రమోషన్ల జాతరకు తెరలేచింది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పదోన్నతులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది. ఈ లిస్టు ఇప్పటికే దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరింది. ప్రమోషన్ల పొందిన వారి జాబితాను కూాడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. దీంతో చివరి నిమిషంలో చక్రం తిప్పి... తమ జాతకాన్ని మార్చుకునేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సమాచారం..

మరి ఇప్పుడు దేవాదాయశాఖ ఏం చేస్తుంది? మళ్లీ పాత పద్ధతినే ఫాలో అవుతారా? లేక నిక్కచ్చిగా వ్యవహరించి.. అర్హులకే పదోన్నతులు కల్పిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. గ్రేడ్- 1 ఈవోల లిస్టులో 76 మంది ఉండగా.. ఇందులో 888 జీవో ఉల్లంఘనకు పాల్పడిన వారు దాదాపు 8 మంది ఉన్నట్లు ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. మొత్తానికి టీవీ5 వరుస కథనాలతో దేవాదాయశాఖలో ప్రక్షాళన మొదలైంది. అన్ని అర్హతలూ ఉండి...ప్రమోషన్లుకు దూరమైన బాధితులంతా టీవీ5కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story