కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే:కిషన్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కండువా మార్చనున్నారా..? హస్తానికి బైబై చెప్పి.. కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా..? ఇప్పటికిప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేకపోయినా.. త్వరలోనే బీజేపీలో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. సొంతపార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అటు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సైతం రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతించారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రాష్ట్రంలోనూ ప్రస్తుతం కాంగ్రెస్‌ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరిగా పార్టీ పిరాయిస్తున్నారు. ఇప్పటికే ఆసెంబ్లీలో సీఎల్పీ హోదా కూడా కోల్పోయింది. ఇలాంటి సమయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర నాయకత్వంపైనా.. రాహుల్‌ సామర్థ్యంపైనా నేతలకు నమ్మకం పోయిందన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు బీజేపీనే సరైన ప్రత్యామ్నాయం అన్నారు.

రెండు రోజుల కిందట కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి సోదరులు బీజేపీ సీనియ‌ర్ నేత రామ్ మాధ‌వ్ తో చ‌ర్చలు జ‌రిపార‌ని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. కానీ రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యాలు చూస్తే.. బ్రదర్స్‌ ఇద్దరూ కమలం గూటికి చేరడం పక్కా అనే అనుమానాలు బలపడుతున్నాయి..

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమే అన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారీపోతుందని అన్నారు. తమతో కలిసివచ్చే నేతలను ఆహ్వానిస్తామని..రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలను కలుపుకొని పోతామని ఆసక్తికర వ్యాక్యలు చేశారు కిషన్ రెడ్డి.

రాజ్‌గోపాల్‌ రెడ్డి మాటలు చూస్తే.. ఇప్పటికప్పుడు పార్టీ మారే ఉద్దేశం లేకపోయినప్పటికీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని పరోక్షంగా బీజేపీలో చేరుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి తోడు కిషన్‌ రెడ్డి సైతం. కలిసి వచ్చే నేతలను ఆహ్వానిస్తాం అని చెప్పడంతో రాజగోపాల్‌ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవడం పక్కా అనే అనుమానాలు పూర్తిగా బలపడుతున్నాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కడప యోగి వేమన యూనివర్సిటీ తీరుపై విద్యార్ధుల మండిపాటు

Sun Jun 16 , 2019
ఏపీలో ఉన్నత విద్యామండలి తీరుపై విద్యార్ధులు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పదేళ్ల తర్వాత సొంత భవనాలను సమకూర్చుకోని కాలేజీకు అనుమతి ఇవ్వొద్దన్నది జీవో 29లో నిబంధన ఉన్నా.. అధికారులు పట్టించుకోలేదు. ఇష్టాను సారం తమకు నచ్చిన కాలేజీలకు అనుమతులు మంజూరు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏపీలో జీవో నెంబర్ 29కి వ్యతిరేకంగా ఉన్నత విద్యామండలి తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అవుతోంది. జీవో […]