ఐడియా అదిరింది బాస్.. అనుపమ్‌ ఖేర్‌కీ నచ్చింది..

viral-photo

చీకటిని తిడుతూ కూర్చోకు చిరు దీపాన్ని వెలిగించు అని పెద్దలు చెప్పినట్లు.. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం గురించి ఆలోచిస్తేనే ఐడియాలు వస్తాయి. సో.. మీ ఆలోచన మరో పదిమందికి ఏంటి.. వేల మందికి కూడా నచ్చేస్తుంది. ఆలోచనకు సృజనాత్మకతను జోడిస్తే అదే వైరల్ అవుతుంది. భారతీయుల సృజనాత్మకతకు సంబంధించి తనను ఆకట్టుకున్న కొన్ని ఫోటోలను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇవి పోస్ట్ అయిన గంటలోనే దాదాపు 26 వేల లైకులతో పాటు వందల కామెంట్లు వచ్చాయి.

ఇందులో కొన్ని ఫన్నీగా ఉన్నా.. కొన్ని ఫోటోలు అవసరానికి ఓ ఐడియా భలే వర్కవుట్ అవుతుంది అని అనిపించకమానదు. ఓ లావాటి వ్యక్తి పడుకునేటప్పుడు పడిపోకుండా పొట్టకి చెక్క అడ్డుపెట్టి పడుకోవడం నవ్వు తెప్పించినా.. అమ్మ వంట చేసుకునేటప్పడు తన చిన్నారిని తన దగ్గరే ఉంచుకునే ప్రయత్నంలో డ్రాలోని ప్లేట్లు, గ్లాసుల మధ్యలో ఉంచింది.. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు.. అమ్మకి వచ్చిన ఐడియా సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. మరో ఫోటో.. గోడ గడియారం సగం విరిగిపోతే మిగతా అంకెలను గోడ మీద రాసి ఉంచారు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమస్యలను అధిగమించాలి.. సమయం మనకోసం ఆగదు అనే సందేశాన్ని ఇచ్చినట్టుగా ఉంది. బాత్‌రూమ్‌‌లో షవర్ లేకపోతేనేం.. బకెట్ ఉందిగా అని దానికే హోల్స్ పెట్టి షవర్ బకెట్‌లో ఉన్న ఆనందాన్ని పంచారు మరో పిక్ ద్వారా.
మరి మీకొచ్చిన ఐడియాని కూడా ఓ క్లిక్ చేస్తే ఓ పిక్ రెడీ అవుతుంది. మీ ఐడియా కూడా అందర్నీ ఆలోచింపజేస్తుందేమో.

TV5 News

Next Post

నిండుకుండలా.. సాగర్

Fri Nov 1 , 2019
నాగార్జున సాగర్‌ జలాశయానికి పైనుంచి వరద నీరు వస్తుండడంతో డ్యామ్‌ 4గేట్లు పైకి లేపి 54,859 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 54,859 క్యూసెక్కుల నీరు సాగర్‌ డ్యాంలోకి వస్తుండగా అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్థుతం డ్యాంలో 590 అడుగుల మేర నీరునిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా.. అదేస్థాయిలో నీరు నిల్వ ఉంది.