సీఎం జగన్ లేఖ రాస్తే సరి : కన్నా లక్ష్మీనారాయణ

పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖరాస్తే తప్పకుండా తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ ఐదేళ్ల కృషి ఫలితంగానే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం మోదీ పరిపాలనా దక్షతకు నిదర్శనమని కన్నా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలిచేందుకు కృషి చేస్తామన్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

లవ్ జిహాద్ కలకలం.. హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడని..

Sat Jun 1 , 2019
హైదరాబాద్ లో లవ్ జిహాద్ వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రేమ పేరుతో తమ అమ్మాయిని మోసం చేసి … మత మార్పిడి చేశారని పంజాగుట్ట పోలీసుల్ని ఆశ్రయించారు తల్లిదండ్రులు. రాత్రి అమ్మనాన్నను చూడాలని ఉందంటూ మెసేజ్ పంపిందని.. ఆ తర్వాత నుంచి తమ కూతురు ఇందిర అందుబాటులో లేకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు తమ అమ్మాయి బతికి ఉందో లేదో అన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. మంచిర్యాలకు చెందిన […]