ఏమిటీ రౌడీ రాజ్యం : చంద్రబాబు ఫైర్‌

వైసీపీ ప్రభుత్వంపై మరో సారి ఫైర్‌ అయ్యారు ప్రతిపక్షనేత చంద్రబాబు. చిరుద్యోగుల ఉసురు పోసుకోంటోందని మండిపడ్డారు. నిన్న ఆశా వర్కర్లు, ఈరోజు ఫీల్డ్ అసిసెంట్లను తీసివేస్తోందని .. ఏమిటీ రౌడీ రాజ్యం అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. వైసీపీ వాళ్లకు ఉద్యోగాలివ్వాలంటే ఇంకొకరి ఉద్యోగాలను పీకేయాలా అని దుయ్యబట్టారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సమర్థత లేనప్పుడు ప్రజలకు ఏం చేద్దామని ఉద్యోగాల హామీలిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు . చిరుద్యోగుల ఆవేదనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

రాజకీయ కురువృద్ధుడు జైపాల్‌రెడ్డి ఇకలేరు

Sun Jul 28 , 2019
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్న జైపాల్‌రెడ్డి.. అర్థరాత్రి ఒంటి గంట 20 నిమిషాలకు.. గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హైఫీవర్‌తో ఆస్పత్రిలో చేరారు జైపాల్‌రెడ్డి. ప్రస్తుతం ఆయన వయస్సు 79 సంవత్సరాలు. ఇన్ని రోజులు తెలంగాణ కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా మారిన జైపాల్‌రెడ్డి మృతితో ఆ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. […]