ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామక రాత పరీక్షల నిర్వహణ తేదీల జాబితాను గురువారం ప్రకటించింది. ఇంతకుముందు కొన్ని పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించగా.. ప్రధాన పరీక్షను నిర్వహించనుంది. మరికొన్నింటికి నేరుగా ఒకే పరీక్షను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన పరీక్షల తేదీల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అక్టోబర్ 22,23,24 తేదీల్లో అటవీ రేంజ్ అధికారి పోస్టుకు, అక్టోబర్ 24,25 తేదీల్లో డివిజనల్ అకౌంట్స్ అధికారి పోస్టుకు, నవంబర్ 20,21,22,23 తేదీల్లో పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు, నవంబర్ 28,29,30 తేదీల్లో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు, 2020 జనవరి 19,20,22,23 తేదీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు.

గెజిటెడ్ పోస్టుల పరీక్షల వివరాలను పరిశీలిస్తే, సహాయ బీసీ, సాంఘీక, గిరిజన సంక్షేమ అధికారి పోస్టులకు నవంబర్ 5,6న పరీక్షలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన ఏపీ బీమా వైద్య సేవల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో జిల్లా సైనిక సంక్షేమ అధికారి పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. పట్టణ, ప్రణాళిక విభాగం పోస్టులకు, సంచాలకుల పోస్టులకు, భూగర్భ జల సేవల విభాగంలో సహాయ కెమిస్టు పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో, పట్టణ ప్రణాళిక సహాయకుల పోస్టులకు నవంబర్ 6, 8 తేదీల్లో, మైనింగ్ రాయల్టీ ఇన్‌స్పెక్టర్ టెక్నికల్ అసిస్టెంట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పోస్టులకు నవంబర్ 6న పరీక్షలు జరగనున్నాయి.

నాన్ గెజిటెడ్ పోస్టులకు కూడా పరీక్షల తేదీల్ని ఖరారు చేశారు. టెక్నికల్ అసిస్టెంట్స్ (జియో ఫిజిక్స్) పోస్టులకు నవంబర్ 25, 27 తేదీల్లో, టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రో జియాలజీ) పోస్టులకు నవంబర్ 26,27 తేదీల్లో, టెక్నికల్ అసిస్టెంట్స్ (మైనింగ్, జియాలజీ) పోస్టులకు నవంబర్ 27న, టెక్నికల్ అసిస్టెంట్ (పురావస్తు) నవంబర్ 26,27 తేదీల్లో, సంక్షేమ నిర్వాహకులు (సైనిమ సంక్షేమ, ఉప సేవకలు) పోస్టులకు నవంబర్ 27న పరీక్షలు జరగనున్నాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఈ హోటల్లో వృద్ధులకు ఉచిత భోజనం

Fri Aug 2 , 2019
కాస్త వయసు మీద పడగానే తల్లిదండ్రులను..  పిల్లలు భారంగా భావిస్తున్నారు. రాను రాను వృద్ధాశ్రమాలలో వయోవృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. పిల్లలు ఉన్నతల్లిదండ్రుల పరిస్థితి ఇలా ఉంటే ఇక నిరుపేదలైన, అనాధ వయోవృద్ధుల పరిస్థితి అగమ్యగోచరమే. అయితే అలాంటి వారి కోసం  నేనున్నాను అంటూ ఓ వ్యక్తి ముందుకు వచ్చాడు. వారి కోసం ఓ హోటల్‌ను ఏర్పాటు చేశాడు. అది వారిని ఆప్యాయంగా పలకరిస్తుంది. కడుపు నిండా భోజనం పెట్టి వారి […]