పదవతరగతి పాసైతే చాలు.. గ్రామ వాలంటీర్‌గా

ap-jobs

ఏపీ ప్రభుత్వం మొదటిసారి గ్రామ వాలంటీర్ల నియామకాన్ని చేపట్టినప్పుడు కనీస విద్యార్హత మైదాన ప్రాంతంలో ఇంటర్, గిరిజన ప్రాంతంలో పది పాసై ఉండాలనేది రూల్‌గా పెట్టారు. కానీ అర్హులైన అభ్యర్థుల నియామకం జరిగిన తరువాత మరి కొన్ని పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. దాంతో ఆ మిగిలిన 9,674 పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. అయితే ఈసారి అర్హతను పదవతరగతినే ప్రామాణికంగా తీసుకుని నియామకాలు చేపట్టనుంది. ఈ మేరకు అనుమతులు తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల వారీగా ఉన్న పోస్టుల కోసం నవంబర్ 1న ఆయా జిల్లా కలెక్టర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తారు. నవంబర్ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. నవంబర్ 16 నుంచి 20 మధ్య.. మండలాల వారీగా ఎంపీడీవో నేతృత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ ఇంటర్వ్యూ లు నిర్వహిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు 22వ తేదీ కల్లా సమాచారం అందించి, వారికి నవంబరు 29, 30 తేదీల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. కొత్తగా ఎంపికైన వారు డిసెంబర్ 1 నుంచి విధుల్లో చేరాల్సి ఉంటుంది.

TV5 News

Next Post

హాస్టల్ రూమ్ షేర్ చేసుకుంటున్నారా.. జాగ్రత్త

Tue Oct 29 , 2019
చదువులు, ఉద్యోగాల నిమిత్తంగా హాస్టల్స్‌లో ఉండక తప్పని పరిస్థితి. హాస్టల్ మేట్ రెండ్రోజుల్లోనే కలిసిపోతాడు. అన్నింటికీ తానున్నానంటూ భరోసానిస్తాడు. మాయమాటలతో నమ్మ బలుకుతారు. చివరికి మొత్తం డాటా లాగేసి ఉడాయిస్తారు. రోజులు అలా ఉన్నాయి. మనుషులు మారిపోతున్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి తెలివితేటలు పెరిగిపోయాయి. అకౌంట్లో డబ్బుని క్షణాల్లో మాయం చేస్తున్నారు. ఈ రోజుల్లో అన్నీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్. కొనాలన్నా, తినాలన్నా కార్డు గీరేస్తున్నారు. అదే అవకాశంగా మార్చుకుంటున్నారు సైబర్ […]