ఏపీ మంత్రి వర్గం భేటీ వివరాలు ఇవే..

cm-jagan

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను తప్పని సరి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే మొక్కజొన్న రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి వర్గం అభిప్రాయపడింది.. రైతులు నష్ట పోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. త్వరగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు.

TV5 News

Next Post

తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారు : పవన్ కల్యాణ్ హెచ్చరిక

Wed Nov 13 , 2019
తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే మట్టిలో కలిసిపోతారని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగుభాష, సంస్కృతిపట్ల మన రాజకీయ నేతలకు ప్రేమ లేదన్నారు. భాష విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంగ్లీష్ అవసరమే కానీ తెలుగునూ కాపాడుకోవాలని పిలుపునిచ్చారు పవన్. ఊరికి ఒక్క విద్యార్థి తెలుగు మాద్యమంలో చదవాలనుకున్నా…తెలుగు మీడియాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడ ఏలూరు […]