యాపిల్ తింటున్నారా.. అయితే జాగ్రత్తండోయ్

ఒకప్పుడు రోజుకో యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్ల్రక్కరలేదు అనేవారు. ఇప్పుడేంటో యాపిల్ తింటే రోగాలు కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు. బాబోయ్ ఏం తినాలన్నా భయం వేస్తుంది.. ఎలా బతికేది. అవునండి రోజుకో యాపిల్ తినడం మంచిదే. దాని వల్ల శరీరానికి కావలసిన ఎక్స్‌ట్రా ఫైబర్, ప్లావనాయిడ్స్, ప్లేవర‌్లు అందుతాయి. అయితే యాపిల్ పండ్లను పెంచే పద్దతిపై ఆధారపడి ఉంటుంది అవి మంచివో కాదో అనే విషయం. మామూలు యాపిల్ పండ్ల కంటే ఆర్గానిక్ ఉత్పత్తులంటూ వస్తున్న యాపిల్ పండ్లలోనే దాదాపు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కనిపెట్టారు. ఈ బ్యాక్టీరియా, ఫంగీ, వైరస్‌లు శరీర సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. 240 గ్రాములు ఉన్న ఒక్కో యాపిల్‌లో సుమారు 100 మిలియన్ల బ్యాక్టీరియా ఉంటుందని అంటున్నారు. ఇంకా యాపిల్ తాజాగా ఉండడం కోసం వాడే కృత్రిమ సాధనాల వల్ల కూడా బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నిజానికి యాపిల్‌కు ఫంగస్‌ వ్యాప్తి చేసే గుణం ఎక్కువగా ఉంటుందని, ఇప్పటికే జరిపిన పలు రకాల యాపిల్ ఉత్పత్తుల ద్వారా నిర్ధారణ అయినట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

నీలి నీడ కమ్మేస్తోంది.. పడుకునే ముందు 87 శాతం మంది..

Fri Aug 2 , 2019
స్మార్ట్‌ఫోన్ కల్చర్ యువత భవిష్యత్‌పై నీలి నీడలు కమ్ముతోంది. మంచి కోసం వాడాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మన యువతరం చెడు వైపు మళ్ళిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లోని నీలికాంతులు కుర్రాళ్ల జీవితాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. పలు సైట్లలోని నీలి చిత్రాలు వీక్షణం వారి భవిష్యత్‌ను అంధకారంలో పడేస్తోంది. యువతి,యువకుల మధ్య ఆకర్షణ కలగడానికి ఇవే కారణమని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. క్షణం తీరిక లేకుండా చాలా మంది యువతి ఫోన్‌లోనే […]