కొంప కాల్చిన శునకం

dog

 

ఇంట్లో మనుషులతో సమానంగా శునకాల్ని చాలా మంది పెంచుతారు. నిజానికి, ఈ మధ్యకాలంలో శునకాలనే.. మషుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అవి మనల్ని కాపాడుతాయనో… దొంగలు వస్తే అరుస్తాయనో.. మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయనో వాటిని ముద్దు చేస్తాం. కానీ, అదే మన ఇంటికి నిప్పంటిస్తుందని తెలిస్తే ఎవరైనా పెంచుతారా?

ఒక శునకం తన యజమాని ఇంటికి నిప్పంటించి మొత్తం నాశనం చేసింది. ఎక్కడ ఏ వస్తువు కనిపించినా.. దాని వాసన చూడటం, దానిని నోటితో నమిలేయటం వాటికి సహజంగా ఉన్న అలవాటు. ఈ అలవాటే పాపం తన యజమాని కొంపముంచింది. కాదు, కాదు కొంప కాల్చింది. దానికి ఎక్కడ దొరికిందో తెలియదు గానీ, సిగరెట్ వెలిగించే లైటర్ ని నోటితో పట్టుకొని ఇంట్లో బెడ్ పైకి ఎక్కింది. అలవాటులో పొరపాటుగా దానిని నమిలినప్పుడు లైటర్ నుంచి మంటలు వచ్చి గది అంతా వ్యాపించాయి. ఇంట్లో నుంచి పొగలు రాగానే ఎమర్జెన్సీ అలారం మోగింది. తరువాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి.. మంటలను అదుపు చేశారు. అయితే, ఇంట్లో మంటలు ఎలా వచ్చాయని లోపల ఉన్న సీసీ ఫుటేజ్ లో చూస్తే.. ముద్దుగా పెంచుకున్న శునకం చేసిన వ్యవహారం బయటపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TV5 News

Next Post

తమిళనాడును వణికిస్తున్న భారీ వర్షాలు

Wed Oct 30 , 2019
తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా పడుతున్నాయి. రామనాథపురంతో పాటు పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. కాంచీపురం, ఆర్కేనగర్, వేలూరు, తిరుత్తణి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తంజావూరు, తిరువారూరు, శివగంగై జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. విస్తారంగా పడుతున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. ఆదివారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి కన్యాకుమారి వైపు కదులుతోంది. ఈశాన్య అరేబియా సముద్రం, లక్షద్వీప్, మాల్దీవులు వైపుగా […]