సూపర్ ఐడియా గురూ..

అందంగా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అనారోగ్యాలెన్నింటినో మోసుకు వస్తుంది. ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్నీ పట్టి పీడిస్తుందని ప్రభుత్వాలు నెత్తీ నోరు మొత్తుకున్నా ప్లాస్టిక్‌తో మమేకమైన మానవ జీవితం.. అది లేనిదే రోజు గడవడం కష్టంగా మారింది. మరి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే ప్రకృతి ప్రేమికులకు చెక్కబాటిల్ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. ఓ ఐఐటీ విద్యార్థి ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో చెక్క బాటిల్‌ను తయారు చేశాడు. అసోం ఐఐటీ యూనిర్శిటీ నుంచి పట్టభద్రుడైన ధ్రితిమాన్ బోరా వెదురు బొంగులతో రూపొందించిన ఈ బాటిల్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇందులో నీళ్లు పోస్తే చల్లగా కూడా ఉంటాయంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చెక్క బాటిల్ ధర ఒకటి రూ.450 నుంచి 700 వరకు ఉంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

సోనాక్షి దెబ్బతో కిందపడ్డ అక్షయ్‌

Sat Aug 10 , 2019
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే నిగర్వి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌. ఇతురుల పట్ల ఆయన ప్రవర్తించే తీరు బాలీవుడ్‌లో అక్షయ్‌ని ఓ ఐకాన్‌గా నిలబెట్టింది. ఎంత మర్యాదస్తుడో అంతే ఫన్నీ కూడా. తనదైన శైలిలో తోటి నటులను ఆటపట్టిస్తూ తనలో కమేడియన్‌ ని కూడా అప్పుడప్పుడు బయటపెడుతూ ఉంటారు. ప్రస్తుతం అక్షయ్ ‘మిషన్‌ మంగళ్‌’ చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా […]