వామ్మో స్క్వేర్ ఫీట్ రూ.56,200లు.. ఎక్కడో తెలిస్తే..

Read Time:0 Second

ఇల్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం అందరికీ సాధ్యం కాదా. పెరుగుతున్న ఈ రేట్లు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఎక్కడికక్కడ డెవలప్‌మెంట్ జరుగుతూ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్‌లు ఆకాశహర్మ్యాలవుతున్నాయి. దక్షిణ ముంబయిలోని తార్‌దేవ్ రోడ్‌ దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇక్కడ చదరపు అడుగు స్థలం ధర రూ.56,200 పలుకుతోంది. స్థిరాస్థి సలహా సంస్థ అన్‌రాక్ దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ఇక్కడ విలాసవంతమైన భవనాలు, కార్పొరేట్ ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు ఉండడమే కారణంగా చెబుతున్నారు. ప్రైమరీ మార్కెట్‌గా భావించే ప్రాంతాల్లోని నూతన ఇళ్ల స్థలాల ధరలు అమాంతం పెరిగిపోయాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close