రైల్లో ఓ వ్యక్తిపై పలువురి దాడి.. పాత గొడవలే కారణం?

 

అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న సుధాకర్‌ అనే ప్రయాణికుడిపై కొందరు దాడి చేశారు. కాలసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో వ్యక్తులు దాడిచేశాక.. స్లోగా వెళుతున్న రైల్లోంచి సుధాకర్‌ దూకాడు. అయినా వెంబడించి కత్తితో గొంతు కోశారు దుండగులు. స్థానికులు గమనించడంతో… దాడిచేసినవాళ్లు పారిపోయారు. సుధాకర్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు.

రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ మండలం పాలంవాండ్లపల్లికి చెందిన సుధాకర్‌.. అదే గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని.. ఇద్దరూ పారిపోయారు. తరువాత సుధాకర్‌ను మందలించి ఆ మహిళను వెనక్కి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వివాహిత భర్త కోపంతో దాడి చేసి ఉంటాడని సుధాకర్‌ సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.

TV5 News

Next Post

మీ ఓటు భద్రంగా ఉందో లేదో ఓసారి చెక్ చేస్కోండి ఇలా..

Sat Nov 16 , 2019
మీ ఓటు మాకే.. మీ ఒక్క ఓటు.. ప్రభుత్వాన్ని మారుస్తుంది.. మీ జీవితాలను మారుస్తుంది.. ఊరించే వాగ్ధానాలెన్ను న్నా.. దేశ పౌరుడు/పౌరురాలిగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ. నచ్చిన నాయకుడికి ఓటు వేద్దామని పోలింగ్ బూత్‌కి వెళితే పేరుండదు. లేదంటే అన్నీ తప్పులు.. మీరు ఓటు వేయడం కష్టం అంటే ఊసురుమంటూ వెనక్కి తిరిగి రావల్సిన పరిస్థితి. మరి వాటన్నింటికీ చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం […]