ఇంట్లో పెట్టుకుంటే దొంగల బెడద అని ఉన్న బంగారాన్నంతా తీసుకెళ్లి బ్యాంక్ లాకర్‌లో పెడుతుంటారు. అక్కడ కూడా భద్రంగా ఉంటుందని బ్యాంకు యాజమాన్యం గ్యారెంటీ ఇవ్వలేదు. ఇంటితో పోలిస్తే బ్యాంకుల్లో దొంగతనాలు జరిగే అవకాశాలు తక్కువే ఉంటాయని భావిస్తుంటారు. కానీ లాకర్‌లోని వస్తువులకు బ్యాంకులు బాధ్యత తీసుకోవనే విషయం చాలా మందికి తెలియదు. అందుకే మీ వస్తువులను లాకర్లో పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. విలువైన మీ బంగారపు […]

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య అలకబూనారు. గవర్నర్‌తో భేటీ అయ్యే నేతల జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో రాజ్‌భవన్‌ నుంచి వెనుదిరిగారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వంపై వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పార్టీలో అవమానం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేస్తేనే ఢిల్లీ నుంచి వచ్చా.. కానీ జాబితాలో తమ పేరు లేదని మండిపడ్డారు. ఇది తమను […]

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండోదశ పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్, స్పీకర్‌ నిదేష్‌ ఓరాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గిలువా.. తదితర ప్రముఖులు ఈ దఫా బరిలో ఉన్నారు. 20 సెగ్మెంట్లలో మొత్తం 260 మంది బరిలో ఉన్నారు. 47 లక్షల మంది వారి భవిష్యత్తుని డిసైడ్‌ చేయనున్నారు. 42 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. […]

నేను చేసేది తప్పు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేస్తున్నాను. అమ్మాయిగా ఉంటే నాలుగిళ్లలో అంట్లు తోముకోవచ్చు.. నాలుగు డబ్బులు సంపాదించవచ్చు. దాంతో అమ్మానాన్నని పోషించుకోవచ్చనే ఈ వేషం వేస్తున్నాను. ఏం.. అబ్బాయిలు చేసే పన్లేవీ దొరకలేదా.. ఏదైనా హోటల్లో కప్పులు కడిగినా, సర్వర్‌గా ఉన్నా ఎంతో కొంత ఇస్తారుగా అంటే.. అవి సరిపోవు.. అదీ కాక ఉదయం నుంచి సాయింత్రం దాకా డ్యూటీ పేరుతో అక్కడే ఉండాలి. ఈ […]

యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమానస్పద స్థితిలో మానవ అస్తికలు కలకలం రేపుతోంది. బొమ్మల రామారం మండల కేంద్రంలో ఉన్న ఎక్స్‌ప్లోజివ్స్‌ పరిశ్రమల పరిసరాలలో అస్థికల గూడు , ఓ చెట్టుకు వేలాడుతూ టవల్‌ , పక్కనే బనియన్‌ కలకలం రేపుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు వంద ఎకరాలలో ఏపీ ఎక్స్‌ప్లోజివ్స్, రెజిఎన్సీ పరిశ్రలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీలలో పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన సమీర్‌ బెహ్రా కనిపించడం లేదంటూ గతంలో […]

ఉత్తరప్రదేశ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బస్తీ పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బ్యాంక్‌లోకి చొరబడ్డ దోపిడీ దొంగలు.. అక్కడి సిబ్బందిని.. కస్టమర్స్‌ను బెదిరించి మరీ చోరీ చేశారు. బ్యాంక్‌ నుంచి ఏకంగా రూ.30 లక్షలు దోచుకెళ్లారు. దొంగలు తుపాకీలు ఎక్కుపెట్టడడంతో.. బ్యాంక్‌లో ఉన్నవాళ్లంతా భయభ్రాంతులకు గురి అయ్యారు. చోరీ విజువల్స్‌ బ్యాంక్‌ సిసి పుటేజ్‌లో రికార్డు అయ్యాయి. బ్యాంక్‌ సెక్యురిటీ సిబ్బంది కూడా దోపిడీని […]

అభిమాన ఆటగాడు వాడిన వస్తువులు ఏవైనా.. ఎంత పెట్టి కొనడానికైనా వెనుకాడరు ఆయన అభిమానులు. ఇటీవల ఇటలీలో జరిగిన వేలంలో బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ ప్లేయర్ పీలె వాడిన జెర్సీ కూడా అంతే క్రేజ్‌తో అమ్ముడు పోయింది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్స్ ట్రోపీ గెలుచుకున్న పీలె జెర్సీని 30 వేల యూరోలు అంటే రూ.26 లక్షల ధర పలికింది. 92 అంతర్జాతీయ గేమ్‌లలో 77 గోల్స్‌తో ప్రదర్శన చేసిన […]

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ బాధితుల బందువులు డిమాండ్‌ చేశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌ ముందు స్థానికులతో కలిసి బాధితుల బందువులు ఆందోళనకు దిగారు. దాదాపు ఏడాది కావస్తున్నా ఇంతవరకు నిందితుడికి శిక్షపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్‌ దిశ హత్య కేసులో హంతకులను ఎన్‌ కౌంటర్ చేసిన మాదిరిగానే హాజీపూర్‌ నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్ […]

ఆన్‌లైన్ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హైద్రాబాద్‌లో ఉన్నతమ సంస్థ కోసం అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా ప్రోగ్రామర్ అనలిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.. అనుభవం: 0-5 సంవత్సరాలు.. SQL,Perl,Python,XML,Ruby, C,C++,Java.. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

స్నేహం ముసుగులో బాలికను చెరబట్టాడో కీచకుడు. బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇస్తానంటూ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణం విజయవాడలోని భవానీపురంలో వెలుగులోకి వచ్చింది. నిందితుడికి అతని తల్లి సాయం చేసినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది.