ప్రజాసమస్యలు తెలుసుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని ఆరోపించారు రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి. కృష్ణా జిల్లా నందిగామ శివారులో అనాసాగరం నుంచి గాంధీజీ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. రైతులకు సొమ్ములు చెల్లించడంలోనూ సామాజిక వర్గాన్ని చూడటం మంచి పద్దతి కాదన్నారు. జాతీయ వాదం వల్లే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. స్కూళ్ల సెలవులు ముగుస్తుండడంతో ప్రత్యామ్నయ చర్యలపై అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే ఆర్టీసీ ఎండీని నియమించేందుకు కూడా కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సమావేశానికి  మంత్రి పువ్వాడ అజయ్‌.. అధికారులు సునీల్‌ శర్మ, సందీప్‌ కుమార్‌ హాజరయ్యారు.  

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి.. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై “మీకు మాత్రమే చెప్తా” అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా విజయ్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. అని మహేష్ బాబు అన్నారు. ‘మీకు మాత్రమే చెప్తా’ కాన్సెప్ట్ […]

హుజూర్‌నగర్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నెల 19తో ప్రచార పర్వానికి తెరపడనుంది. 21న ఉప ఎన్నిక జరుగనుంది. పోలింగ్‌కు టైమ్ దగ్గర పడడంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. గెలుపుపై ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో మూడ్రోజుల్లో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో నేతలంతా అక్కడే మకాం వేశారు… హుజూర్‌నగర్‌లో విజయం సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది టీఆర్‌ఎస్‌. ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి…నిజయోకవర్గంలో […]

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కారు. చేనేత కార్మికుల కోసం కొత్త పథకాన్ని తేబోతున్నారు. వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ. 24 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఏటా డిసెంబర్‌ 21న అందజేస్తారు. మత్య్సకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం 10 వేలకు పెంచారు. మైకనైజ్డ్‌ బోట్లు ఉన్నవారికే కాకుండా తెప్పలపై వేట సాగించేవారికి కూడా పథకం వర్తిస్తుంది. మత్య్సకారులకు డీజిల్‌పై లీటర్‌కు 9రూపాయల […]

ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ శాఖలో రివర్స్‌ టెండరింగ్ ప్రక్రియకు సిద్ధమైంది.. జగన్‌ సర్కారు. ఇందులో భాగంగా… పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లోనూ రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టనున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత, అవినీతికి తావు లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఏపీ టిడ్కోలో కూడా రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని […]

ఇసుక అక్రమ రవాణా, టీడీపీ నేతలపై దాడులు, అక్రమ కేసుల బనాయింపులను నిరసిస్తూ.. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఒక రోజు దీక్ష చేపట్టారు. పరిపాలనలో సీఎం జగన్‌ విఫలమయ్యారని విమర్శించారు. ఇసుక దొరక్క పనులు ఆగిపోయాయని, వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ సౌమ్య ఫైర్‌ అయ్యారు.

కర్నూలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో అధికార పార్టీ వర్గీయులు బీభత్సం సృష్టించారు. కోడిగుడ్ల టెండర్లు దక్కించుకునే విషయంలో వివాదం తలెత్తడంతో… ఇరు వర్గాల వారు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. DEO ఆఫీసు ఎదుట ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా… జనం భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దుండగులు… DEO ఆఫీసులోకి కూడా చొరబడడంతో… సిబ్బంది హడలిపోయారు. పోలీసుల రాకతో దుండగులు పరార్‌ అయ్యారు. ఘటనను […]

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో ప్రమాదానికి గురైన వశిష్ట బోటు వెలికితీత.. టీవీ సీరియల్‌లా మారింది. ఎన్నో ఆశలతో రెండో దఫా వెలికితీత పనులు మొదలు పెట్టిన ధర్మాడి సత్యం బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. బోటుకు లంగరు వేసి ఇనుప రోప్‌ అనుసంధానం చేశారు. అయితే దాన్ని లాగే క్రమంలో లంగరు పట్టు తప్పింది. దీంతో వెలికితీత పని మళ్లీ మొదటికొచ్చింది. ఘటన స్థలంలో చీకటి అలుముకోవడంతో… వెలికితీత పనులను […]

దీపావళి వచ్చేస్తోంది. మామూలుగా అయితే ఇప్పటికే నగల దుకాణాలు కళకళలాడాలి. కొనుగోళ్లతో వెలిగిపోవాలి. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. అమ్మకాలు లేక జ్యువెలరీ షాప్స్‌ వెలవెల బోతున్నాయి. పండుగ వెలుగులు లేక బోసిపోతున్నాయి. చుక్కలనంటుతున్న బంగారం ధరలకు… ఆర్థిక మందగమనం ఎఫెక్ట్ కూడా తోడైంది. ఈ సంవత్సరం ధనత్రయోదశి, దీపావళి పండగలు నగల వ్యాపారులకు కలిసొచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం పసిడి ధర గత ఏడాదితో పోలిస్తే […]