గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందన్నారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్శించాయని చెప్పారు. రైతులకు మరో లక్ష రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఐదు వసంతాలు పూర్తి చేసుకొని.. ఆరో ఏట అడుగుపెట్టింది తెలంగాణ. రాష్ట్ర అవతరణ వేడకలను ఘనంగా నిర్వహించారు. గత సంప్రదాయానికి భిన్నంగా […]

తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. పలుజిల్లాల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఇక పార్టీల ఆఫీసుల్లోనూ అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాలకు ఘన నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని ఎగువవేశారు. తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ […]

విజయవాడ భవానిపురంలో అర్థరాత్రి అల్లరిమూకలు రెచ్చిపోయారు. టిఎస్‌ఆర్‌టిసి బస్‌ను నిలిపి ఆవేశంతో డ్రైవర్‌పై దాడి చేశారు. బస్‌ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే యువకులు మాత్రం డ్రైవర్‌దే తప్పని ఆరోపిస్తున్నారు. తమను ఢీ కొట్టడమే కాకుండా.. బాస్‌ ఆపకుండా వెళ్లాడని.. అందుకే బస్‌ను ఓవర్‌టేక్‌ చేసి నిలదీశమంటున్నారు. బెజవాడలో అర్ధరాత్రి అల్లరి మూకలు భీభత్సం సృష్టించాయి. తాము వెళ్తున్న బైక్‌కు సైడ్ ఇవ్వలేదని […]

జగద్గిరిగుట్ట మండలంలో దారుణం చోటుచేసుకుంది. క్వారీ గుంతలో పడి తల్లి కొడుకులతో పాటు ఓ వృద్ధురాలు మృతి చెందారు. గాజులరామారం బాలయ్యనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు అనిత, ఆమె కొడుకు యశ్వంత్ గా గుర్తించారు. మహాబూబ్ నగర్ నారాయణపేటకు చెందినవారీగా చెబుతున్నారు. అమ్మయ్య అనే వృద్ధురాలిది కర్ణాటకలోని యాదగిరి జిల్లాగా చెబుతున్నారు. బాలయ్యనగర్ లో ఓ శుభకార్యానికి హజరైన ఈ ముగ్గురు ఉదయం 10 గంటల […]

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రగతిపై పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. కుప్పం ఐదేళ్ల ప్రగతిపై నివేదిక కోరారు. దీంతో చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజినీర్లు నివేదిక సిద్ధం చేస్తున్నారు. గత ఐదేళ్లలో కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం.. రామకుప్పం మండలాల్లో జరిగిన అభివృద్ధిపై అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ప్రార్థన స్థలంలో మాంసం తింటున్నారనే కారణంతో నలుగురు యువకులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. బెల్ట్‌లతో చావబాదారు. కాలితో తన్నారు. వద్దని వేడుకున్నా.. వదిలేయాలని బతిమాలిన.. దుండగులు జాలి చూపలేదు. యువకులపై మూక దాడి .. వైరల్‌గా మారింది.

ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన జరిగే శాసన సభాపక్ష సమావేశంలో.. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. అవకాశం దక్కనివాళ్లు నిరాశపడకుండా ఉండేలా వారికి భరోసా ఇస్తారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది.. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. పార్టీ […]

ఆమె మతిస్థిమితం లేని వికలాంగురాలు.. భిక్షాటన చేస్తూ కడుపునింపుకునే మహిళపై ఇద్దరు కామాంధులు కన్నేశారు. రాత్రి ఒంటరిగా ఉన్న ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్‌లో చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని బాధిత మహిళ.. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది. శనివారం రాత్రి ఇద్దరు యువకులు మద్యం మత్తులో వికలాంగురాలిని పక్కనే ఉన్న వర్క్‌షాప్‌లోకి బలవంతంగా లాక్కెళ్లి […]

*ఈనెల 7వ తేదీన వైసీపీఎల్పీ సమావేశం *ఉదయం 10 గంటలకు జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం *తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీటింగ్ *మంత్రివర్గ కూర్పు, అసెంబ్లీ సమావేశాలకు ముందు.. *ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

కేంద్రం ప్రవేశపెట్టబోయే నూతన విధ్యావిధానం ముసాయిదాను ప్రజల్లోకి తీసుకురాబోతున్నామన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు దీనిపై చర్చించి సూచనలను ఇవ్వాలని కోరారు. విశాఖలో ఐఐపీఈ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమీ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొత్త ఆలోచనలు భవిష్యత్‌కు భరోసా ఇచ్చేలా ఉండాలని..విద్యార్ధులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.