అయోధ్య వ్యవహారం చివరి అంకానికి చేరింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. కక్షిదారులు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. వివాదాస్పద ప్రాంతం ఎవరికి చెందుతుందనే అంశంపై కక్షిదారుల తరఫున న్యాయవాదులు కోర్టుకు వివరాలు సమర్పించారు. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నవంబర్ 17లోపు తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు భావిస్తోంది. ఇక, వాదనల చివరి రోజు సుప్రీంకోర్టులో హైడ్రామా చోటు చేసుకుంది. ముస్లింల త‌ర‌పున వాదిస్తున్న […]

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, బీజేపీ ఎంపీ CMరమేష్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు మెగాస్టార్‌ చిరంజీవి. సాయంత్రం ఉపరాష్ట్రపతి నివాసంలో సైరా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు మరికొందరు ఢిల్లీ పెద్దలు హాజరు కానున్నారు. బీజేపీ నేతలతో కలిసి చిరు వెళ్లడంతో.. రాజకీయ ప్రాధాన్యంపై చర్చ మొదలైంది.

నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50. రూ.10 నోట్లను తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు రూ.2000 నోటును రద్దు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ పావులు కదుపుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2000ల నోటును కూడా ముద్రించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ.2 వేల నోట్లను ఫ్రింట్ చేసిన ఆర్బీఐ.. 2017-18 ఆర్థిక […]

పంది దాడిలో వృద్ధుడు మృతి చెందాడు. ఈ సంఘటన నాగర్ కర్నూల్‌ జిల్లా బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్‌ గ్రామంలో చోటు చేసుకుంది. నడవలేని స్థితిలో ఇంట్లో ఉన్న వృద్ధుడు కొండయ్య తల, చేతిపై దాడి చేసింది.. దీంతో ఆయన అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో పందులను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో పందుల బెడద ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టింకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం […]

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గరలో గోదావరిలో మునిగిన బోటును వెలికితీసే ప్రక్రియలో పురోగతి కనిపిస్తోంది. వశిష్ట బోటుకు లంగరు తగిలిందని ధర్మాడి సత్యం బృందం సభ్యులు చెబుతున్నారు. దీంతో లంగరుకు బలమైన ఐరన్‌ రోప్‌ను జోడించి… బోటును బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇదే దశలో రోప్‌ తెగిపోవడంతో.. ప్రయత్నాలు నిలిచిపోయాయి. అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా బోటును తీస్తామన్న ధీమాతో సత్యం బృందం కనిపిస్తోంది.

బాహుబలి తరువాత భారీ హిట్ కోసం ప్రభాస్‌ చేసిన సినిమా సాహో. 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్‌ టాక్‌ వచ్చింది. అయినా కలెక్షన్ల సునామి సృష్టించింది. సినిమా ప్లాప్ టాక్ వచ్చినా.. అసలేముందో చూద్దామని సినిమా చూసిన వాళ్లే ఎక్కువ. దాంత్ దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో ‘సాహో’ […]

అందాల తార రమ్యకృష్ణ దాదాపుగా అందరి హీరోలతో ఆడి పాడింది. వరుస సినిమాలు చేస్తూ తన సత్తాను చాటుతోంది. రమ్యకృష్ణ స్థాయిని మరింత పెంచిన చిత్రం బాహుబలి. అందులో ఆమె శివగామిగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రమ్య ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ నిర్మాణంలో రూపొందుతున్న ‘రొమాంటిక్’ చిత్రంలో నటించనున్నారు. పూరీ కుమారుడు ఆకాష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రను […]

పోస్టాఫీస్‌లో సేవింగ్ చేస్తే డబ్బుకి భద్రతతో పాటు ఆదాయపు పన్ను చట్టం నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. ఇందులో కస్టమర్లకు ఆఫ్‌లైన్ సేవలతో పాటు ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల పథకాలు పోస్టాఫీసులో అందుబాటులో ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సీ కింద ఉన్న కొన్ని స్కీమ్స్ గురించి.. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ […]

సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. నాసిరకం విత్తనాలు పంపిణీ చేస్తున్నారంటూ అధికారులను నిలదీశారు అన్నదాతలు. జమ్మలమడుగు మండల కేంద్రంలో రైతులకు రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అయితే అవి నాసిరకంగా ఉన్నట్టు గుర్తించిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా స్పందించలేదు. దీంతో ఆందోళనబాట పెట్టారు. అధికారులు విత్తనాలను పరిశీలించకుండానే సరఫరా చేస్తున్నట్టు రైతులు ఆరోపించారు. తమకు నష్టం వస్తే ఎవరు భరిస్తారని […]

బుల్లితెరపై సందడి చేస్తున్న యాంకర్ వెండితెరపై కూడా వెలిగిపోతోంది. వరుస సినిమాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి పాత్రల్లో మెరుస్తోంది. రంగస్థలంలోని తన పాత్ర ద్వారా తన రేంజ్‌ని అమాంతం పెంచేసిన అనసూయ తాజాగా ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ నిర్మించారు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమాలో వాడిన కొన్ని అభ్యంతరకర పదాల గురించి విమర్శించిన అనసూయ.. మరి […]