TV5 News

జాతీయ జనాభా పట్టిక-ఎన్‌పీఆర్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

జాతీయ జనాభా పట్టిక-NPRకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. NPR విషయంలో ప్రజల్లో నెలకొన్న అపోహలు, అనుమానాలు తొలగించడానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జన గణన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనగణన, NPRలపై వివిధ వర్గాల ప్రజల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్న ప్రభుత్వం, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని సూచించింది. […]

నిర్మలా సీతారామన్‌తో జనసేన-బీజేపీ నేతల బృందం సమావేశం

వారంలో రెండోసారి ఢిల్లీ వెళ్లారు పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన-బీజేపీ నేతల బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, రాజధానితో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధాని అమరావతే అంటూ గంటాపథంగా చెప్పారు పవన్ కళ్యాణ్. […]

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్

ఏపీ శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకున్న విచక్షధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. అయితే, చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార వైసీపీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. పోడియం […]

ఎయిర్‌పోర్టులో తానే బాంబ్ పెట్టా అని లొంగిపోయిన వ్యక్తి

మంగుళూరు ఎయిర్‌పోర్టు బాంబ్ బ్లాస్ట్ కేసులో మిస్టరీ వీడుతోంది. ప్రధాన అనుమానితుడు ఆదిత్యరావు పోలీసుల ముందు లొంగిపోయాడు. బాంబు తానే పెట్టానంటూ బెంగళూరులోని డీజీపీ ఆఫీసులో అతను సరెండర్ అయ్యాడు. అనంతరం అతనికి విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆ తర్వాత స్థానిక కోర్టులో హాజరుపరిచారు. 36 ఏళ్ల ఆదిత్యారావు.. మణిపాల్‌ కు చెందిన వ్యక్తి. ఇంజినీరింగ్ చేసి MBA […]

రష్యాలో విషాదం.. అగ్నిప్రమాదంలో 11మంది మృతి

రష్యాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైబీరియాలోని ఓ టింబర్‌ డిపోలో అగ్నిప్రమాదం జరిగి 11 మంది కూలీలు చనిపోయారు. మృతుల్లో 10 మంది ఉజ్బెకిస్తాన్‌కు చెందినవారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మధ్య ఆసియాకు చెందిన లక్షలమంది వలస కూలీలు రష్యాలో పనులు చేస్తూ జీవిస్తున్నారు. ప్రిచులిమ్‌స్కై సెటిల్మెంట్‌లోని ప్రైవేటు టింబర్‌ డిపోలో […]

నిత్యానందపై బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్

వివాదాస్పద స్వామి నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్ జారీ అయ్యింది. నిత్యానంద ఆచూకీ చెప్పాలని ప్రపంచ దేశాలను ఇంటర్ పోల్ కోరింది. నిత్యానంద ఆచూకీ తెలుసుకోవడానికి సహకరించాలంటూ గుజరాత్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. స్పందించిన ఇంటర్‌పోల్, నిత్యానందపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అమ్మాయిలను లైంగికంగా వేధించాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. గుజరాత్‌లోని ఆశ్రమంలో బాలికలను అక్రమంగా నిర్బంధించారని అభియోగాలు నమోదయ్యాయి. కేసుల నేపథ్యంలో […]

సీఏఏ అంశంలో విపక్షాలకు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి అంగీకరించని సుప్రీం కోర్టు

పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ సర్కారుకు బిగ్ రిలీఫ్ లభించింది. పౌరచట్టంపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. CAA ప్రక్రియను నిలిపివేయడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పు కోలేదు. ఈ చట్టంపై కేంద్రప్రభుత్వం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిలోపు హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే […]

మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ.. మరోసారి కశ్మీర్ అంశంపై స్పందించిన ట్రంప్

వద్దన్న పని చేయడం అమెరికా అధ్యక్షునికి అలవాటుగా ఉన్నట్లుంది. మీ జోక్యమే వద్దు అని భారతదేశం పదే పదే చెబుతున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్‌ పట్టించుకోవడం లేదు. తాజాగా మరోసారి అదే మాట మాట్లాడారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ అంశాన్ని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని ట్రంప్ తెలిపారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం రద్దు […]

గగన్‌యాన్ ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రయోగానికి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఈ నెల చివర్లో రష్యాకు వెళ్లనున్నారు. అక్కడ వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 1984లో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్‌ శర్మ రష్యన్‌ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారతీయ వ్యోమగాములు స్వదేశీ మాడ్యూల్‌ లోనే రోదసీలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోని మానవులను పంపడమే […]

శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం

  మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మండలిలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టే ముందే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాల్సిందన్న మంత్రి బొత్స వాదనను టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుబడుతున్నారు. రాజధాని విభజన బిల్లును బుధవారం సాయంత్రం 6 గంటలకు మండలిలో ప్రవేశపెడితే.. బుధవారం ఉదయమే బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నోటీసిచ్చామని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. రాజధాని విభజన బిల్లుపై ఓటింగ్ […]