ప్రముఖ సీనియర్ నటుడు, రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మే 14న వారణాసిలో తన తల్లి అస్తికలు నిమజ్జనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వెన్నముకకు శస్త్రచికిత్స చేయాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు వెంటనే వెన్నముక శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన.. వారం రోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ […]

అందరిలా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అమ్మాయి.. అందరిలా సెలబ్రేట్ చేసుకోలేదు. కన్నీటి సుడులతో ఆ హాల్ నుంచి బయటకు పరిగెత్తింది. దేశ బోర్డర్‌ వరకు వెళ్లిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన సరాయి రూయిజ్ పట్టా చేతికి అందగానే వెంటనే బయటకు పరుగులు తీసింది. దీంతో అక్కడ ఉన్నవారికి ఏం జరిగిందో అర్థం కాలేదు. పట్టా చేత పట్టుకుని ఆ విద్యార్థిని నేరుగా బోర్డర్‌లోని ఓ బ్రిడ్జీ […]

విజయవాడలో ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రామారావు అనే వ్యక్తి… ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు జమ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. బోగస్‌ ఎస్‌ఎంఎస్‌లో అమాయక జనాన్ని వల్లో వేసుకుని లక్షల రూపాయలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు రామారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో రెండు నెలల వ్యవధిలో 19 మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి […]

అభిమానం, ప్రశంసలు కళాకారులను మరో మెట్టు ఎక్కిస్తాయి. వారి కళా ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు ఓ జ్ఞాపకంగా మిగిలిపోతాయి. తాజాగా ప్రముఖ గాయని స్మిత తన జీవితంలో ఎదురైన ఓ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆమె కెరీర్‌ ఆరంభంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి 2002లో తనకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌‌ను జ్ఞాపకం చేసుకున్నారు. “ఓ గాయనిగా నా […]

ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోనియాగాంధీని తమ నాయకురాలిగా ఆ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియా పేరు ప్రతిపాదించగా.. మిగిలిన వారంతా సమర్థించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి తీవ్రంగా మదన పడుతున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఆమేరకు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ […]

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ శనివారం భేటీ కానుంది. సమావేశం కానున్న కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ పార్లమెంటరీ నేతను ఎన్నుకోనున్నారు. గెలిచిన 52 మంది ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పార్లమెంటరీ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకుంటారు అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్‌లో ఒకింత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. మొన్న జరిగిన సీడబ్యూసీ సమావేశంలో ఏకంగా రాజీనామా చేసేందుకు సిద్ధ పడ్డారు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ […]

రెండు సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో అమిత్‌షాది కీలక పాత్ర. ఆయన్ను అపర చాణక్యుడిగా పిలుస్తారు కమలం పార్టీ నేతలు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేసి నెంబర్‌ టూగా పేరు తెచ్చుకున్న అమిత్‌ షాకి హోంశాఖ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక ఉన్న జాతీయ అజెండా ఏంటి? అవును హోంశాఖ మంత్రిగా అమిత్‌ షాను ఎంపిక చేయడం వెనుక ప్రధాన వ్యూహం… ఇన్నాళ్లుగా చెబుతున్న […]

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నిన్నటిదాకా నిప్పుల కుంపటిని తలపించిన ఈ ప్రాంతం చిరు జల్లులతో చల్లబడిపోయింది. భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ప్రమాణ స్వీకారం అవగానే పరిపాలనపై ఫోకస్ పెట్టిన ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. సమీక్షలు, బదిలీలు, నియామకాలు, అవసరం లేని ఉద్యోగాలపై కొరడా ఝులిపిస్తూ.. వరుస నిర్ణయాలతో తన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నుంచి శాఖల వారిగా సమీక్షలు నిర్వహించనున్నారు సీఎం జగన్‌. ఈ ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో జగన్‌ సమీక్ష చేస్తారు. రాష్ట్ర ఆర్థిక స్థితి గతులపై […]

పెళ్లింట డీజే రౌడీలు ఎంటరయ్యారు. కర్రలు, రాడ్లతో దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టారు. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో జరిగిందీ దారుణం. పచ్చని పందిరి.. రక్తంతో తడిసిపోయింది. డీజే సౌండ్ పెంచమన్నందుకు గొడవ మొదలైంది. డీజే నిర్వాహకుడు తన స్నేహితులకు ఫోన్‌ చేశాడు. అల్లరి మూకల్ని రప్పించాడు. పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా ఎంటరైన వాళ్లు.. విచక్షణారహితంగా ప్రవర్తించారు. వరుడి కుటుంబాన్ని, వధువు బంధువులను వదల్లేదు. మాతో పెట్టుకుంటారా అంటూ చితకబాదారు. మండపాన్ని ధ్వంసం […]