TV5 News

కర్ణాటకలో సిఎల్పీ సమావేశం.. రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం..

కర్నాటక సంక్షోభం నేపథ్యంలో సిఎల్పీ సమావేశం అయ్యింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజా సమావేశం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ సహా ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నేతృత్వంలో సిఎల్పీ భేటి జరుగుతోంది. అటు సిఎల్పీ సమావేశానికి రెబల్ ఎమ్మెల్యేలు […]

ఇంటి పెరట్లోనే చేపల పెంపకం.. నెలకు 25వేల సంపాదన.. శిక్షణ పొందాలంటే..

ఇంట్లో కాస్త పెరడు ఉంటే మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మందులు లేని కూరగాయల్ని పండిస్తూ ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నారు. మొక్కలు పెంచుకున్నట్టుగానే చేపల పెంపకాన్ని కూడా ఇంటి పెరట్లో చేపట్టవచ్చంటున్నారు ఆక్వాకల్చర్ అధికారులు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయితీరాజ్ (ఎన్‌ఐఆర్డీపీఆర్) ఒక కొత్త తరహా ఆక్వాకల్చర్ విధానాన్ని పరిశీలిస్తోంది. కొచ్చి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు […]

కర్నాటకలో పార్టీల బలాబలాలు

మొత్తం అసెంబ్లీ సీట్లు 224 మ్యాజిక్‌ ఫిగర్‌ 113 కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు 79 ( స్పీకర్‌ తో కలిపి) జేడీఎస్‌ సభ్యులు 37 స్వతంత్ర ఎమ్మెల్యేలు 02 కాంగ్రెస్‌- జేడిఎస్‌ సంకీర్ణ బలం 118 బీజేపీ సభ్యుల సంఖ్య 105 బీజేపీకి మద్దతు ఇస్తామన్న ఇండిపెండెంట్లు 02 ఇండిపెండెంట్ల మద్దతుతో బీజేపీ బలం 107 14 మంది రాజీనామాలు ఆమోదిస్తే కాంగ్రెస్‌-జేడీఎస్‌ […]

‘ఏపీ సహా 10 రాష్ట్రాలకు ప్రత్యేక సాయం పరిశీలనలో ఉంది’

గత ఏడాది ప్రత్యేక ప్యాకేజీ కింద 10 రాష్ట్రాలకు అత్యవసర నిధులు కేటాయించినట్టు ఆర్ధిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో రాతపూర్వక సమాధానంలో తెలిపారు. తెలంగాణకు విభజన హామీల్లో భాగంగా 450 కోట్లు వెనకబడిన జిల్లాలకు ఇవ్వడం జరిగిందన్నారు. ఏపీలో విదేశీ ఆర్ధికసాయం కింద చేపట్టిన పథకాలకు వడ్డీ రాయితీ కింద 15 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాలకు […]

హైదరాబాద్‌ వాసుల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

హైదరాబాద్‌ మహానగరం దాహార్థిపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌ చేసింది. జలమండలి నళ్లాలు, ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్న నీరు ఏ మూలకు సరిపోవడం లేదని గుర్తించింది. తాగునీటి సమస్యలను అధిగమించడంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నగరానికి ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని సీఎం […]

రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు గోదావరి నీరు : సీఎం జగన్

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామని ఏపీ సీఎం జగన్ వివరించారు. జమ్మలమడుగులో నిర్వహించిన రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్.. వైఎస్సార్‌ పెన్షన్‌ పథకం కింద అవ్వాతాతలకు 2 వేల 250, దివ్యాంగులకు 3 వేలు, డయాలసిస్‌ పేషంట్లకు 10 వేల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కడప జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా 70 కోట్లు […]

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30 లేదా 31వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. అందుకు కసరత్తు కూడా వేగవంతం చేసింది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో వార్డుల విభజన తుది దశకు చేరుకోంది. దీంతో ఈ నెల 14న ఓటర్ల తుది జాబితాను ప్రకటించి..16న ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్ చేయాలని చూస్తుంది. ఎన్నికల నిర్వహణపై చర్చించి..అభ్యంతరాలు […]

కర్ణాటకలో ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి మాస్టర్ ప్లాన్

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సంక్షోభంలో నుంచి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కూటమి నేతలు శతవిధలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్‌ కమల్‌కు చెక్ పెట్టి, అసంతృప్త ఎమ్మెల్యేలను దారికి తెచ్చుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు.. ప్రభుత్వం కూలిపోకుండా ఉండేందుకు కూటమి మంత్రులు […]

భారత్‌-కివీస్‌ మధ్య తొలి పోరు.. వర్షం పడితే లాభం ఎవరికో తెలుసా?

వ‌ర‌ల్డ్ క్రికెట్ టోర్ని చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో మూడు మ్యాచ్‌లతో విజేత ఎవ‌రో తేలిపోతుంది. ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌ మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానం వేదికగా ఇవాళ జరగనుంది. పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్‌, నాలుగో స్థానంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ వరల్డ్ కప్‌లో భారత్‌-కివీస్‌ మధ్య తొలి పోరు ఇదే. ఈ మొదటి నాకౌట్‌ పోరు కోసం కోట్లాది మంది […]

రాంప్రసాద్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి..

సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులొకొచ్చింది. రాంప్రసాద్‌ని తానే హత్య చేశానంటూ మీడియా ముందుకొచ్చి నేరం ఒప్పుకున్నాడు నిందితుడు శ్యామ్ . చోటూ, నరేష్‌తో కలిసి ఈ హత్య చేసినట్టు చెప్పాడు.. మర్డర్ చేసింది తానేనని…చేయించింది మాత్రం రాంప్రసాద్ బావమరిది శ్రీనివాస్ అని పేర్కొన్నాడు. రాంప్రసాద్ పై అటాక్ చేసిన తర్వాత ఎల్బీనగర్ మీదుగా విజయవాడ పారిపోయినట్లు […]