TV5 News

జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని బీజేపీ ఏపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి చెప్పారు. జగన్ సర్కారుకు తోడ్పాటును అందిస్తామన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ కు ఏపీ బీజేపీ తరపున విష్ణువర్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల జాబితాలో జగన్..

ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం దేశంలో పదవిలో ఉన్న అతిచిన్న వయసు ముఖ్యమంత్రుల్లో జగన్ ఒకరు. ఏజ్ పరంగా చూస్తే జగన్ ఐదో స్థానంలో ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ఈ మధ్యే ప్రమాణస్వీకారం చేసిన ఫెమాఖండు అతిచిన్న వయసున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఈయన ఏజ్ 39 సంవత్సరాలు. రెండోస్థానంలో మేఘాలయ […]

17 ఏళ్ల వయసులో మోదీ తీసుకున్న ఓ నిర్ణయం..

ధగధగలాడే బంగారానికైనా సమ్మెట పోటు తప్పదు. మోదీ జీవితం కూడా అంతే. ఆయన ప్రధాని స్థాయికి చేరడానికి.. చిన్నతనంలో అనుభవించిన కష్టాలు పాఠాలెన్నో నేర్పాయి. అందుకే ఓ ఛాయ్ వాలా.. దేశాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగారు. 17 ఏళ్ల వయసులో మోదీ తీసుకున్న ఓ నిర్ణయం ఆయన లైఫ్ ను ఎలా మార్చింది? నరేంద్రమోదీ కుటుంబానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా గుజరాత్ […]

సీఎంవో ఉన్నతాధికారులపై బదిలీ వేటు

సిఎంవో కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సిఎంవో ముఖ్య అధికారులను బదిలీ చేశారు. CM ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి స‌తీష్ చంద్ర, CM ముఖ్య కార్యద‌ర్శి సాయి ప్రసాద్, CM కార్యద‌ర్శి గిరిజా శంక‌ర్, CM కార్యద‌ర్శి అడిసిమ‌ల్లి వి జ‌మౌళిపై బదిలీ వేటు పడింది. వెంటనే సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు […]

ఆమ్లా..కోహ్లీ రికార్డును దాటేస్తాడా.. అతనికి ఇదే ఆఖరి ప్రపంచకప్‌?

ప్రపంచ కప్ మెుదలైంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా క్రీడా సంగ్రామం గురువారం మెుదలవుతుండడంతో క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అన్ని జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనే దానిపై అందరికి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్ ఉన్నా.. ఆస్ట్రేలియా,ఇండియా జట్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. […]

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఢిల్లీ టూర్ రద్దైంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి కేసీఆర్, వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. ఐతే, చివరి క్షణంలో వారి ప్రయాణం రద్దైంది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతి లేకపోవడంతో.. షెడ్యూల్‌లో లేని విమానాల ల్యాండింగ్‌కు అనుమతులు.. రద్దు చేసింది పౌర విమానయాన శాఖ, మధ్యాహ్నం 3.30 గంటల లోపు […]

ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ నియామకం : సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి లబ్దిదారుడికి అందించే బాధ్యత వాళ్లదేనని జగన్‌ చెప్పారు.

నేడు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేది వీరే..

కేంద్ర మంత్రిమండలిలో ఇప్పటివరకూ చోటు దక్కిన నేతలు రాజ్‌నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ సదానంద గౌడ అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకాశ్ జవడేకర్ రాందాస్ అథవాలే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ బాబుల్ సుప్రీయో సురేశ్ అంగాడి (New Face) డా. జితేంద్ర సింగ్ పీయూష్ గోయల్ రవిశంకర్ ప్రసాద్ కిషన్ రెడ్డి (New Face) ప్రహ్లాద్ జోషి నిర్మలా సీతారామన్ స్మృతి ఇరానీ […]

ఆమెను కాపాడ్డం కోసం అతను రంజాన్ ఉపవాస దీక్షను..

మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించాడు ఓ వ్యక్తి. నీతి, నిజాయితీ ఇంకా చావలేదని, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఈ సంఘటన రుజువు చేసింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం రంజాన్ ఉపవాస దీక్షను కూడా వదిలేశాడు ఓ ముస్లిం వ్యక్తి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణికి సహాయం చేయడానికి రాజస్తాన్‌‌కి చెందిన ఓ ముస్లిం […]

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు.. – ఏపీ సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి లబ్దిదారుడికి అందించే బాధ్యత వాళ్లదేనని జగన్‌ చెప్పారు.