ఆటో డ్రైవర్‌ షర్టు విప్పి నడి రోడ్డుపై..

ప్రకాశం జిల్లా మార్టూరులో మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్‌ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి.. షర్టు విప్పి నడి రోడ్డుపై హడావుడి చేశాడు. రహదారిపై వచ్చే వాహనాలను ఆపుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేశాడు. తన ఒంటిపై గాయాలు చేసుకుని బస్సులను ఆపే ప్రయత్నం చేశాడు. అతడ్ని ఆపేందుకు వచ్చిన పోలీసులను సైతం లెక్క చేయకుండా హల్‌చల్‌ చేశాడు. కొన్ని గంటల పాటు హడావుడి తరువాత స్థానికుల సాయంతో పోలీసులు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

మంత్రి ఇలాఖాలో వైసీపీ వర్గపోరు

Fri Jul 12 , 2019
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఇలాఖా నెల్లూరు జిల్లాలో వైసీపీ వర్గపోరు బయటపడింది. రాజవోలు సొసైటీ అధ్యక్షుడు కాటంరెడ్డి నరసింహారెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు పందిళ్లపల్లి సుబ్బారెడ్డి మధ్య నెలకొన్న ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద మాటామాటా పెరగడంతో రెండు వర్గాల వైసీపీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడ్డారు. చివరకు వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఇరువర్గాలు […]