జెండాను తలకిందులగా ఆవిష్కరించిన మంత్రి అవంతి శ్రీనివాస్

Read Time:0 Second

విశాఖపట్నంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అపచారం చోటు చేసుకుంది. మంత్రి అవంతి శ్రీనివాస్‌.. జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించడం పూర్తయ్యేవరకు అలాగే ఎగురవేశారు. మంత్రి అవంతితో పాటు.. ఏ ఒక్క వైసీపీ నాయకుడు కానీ.. కార్యకర్త కానీ.. ఈ విషయాన్ని గుర్తించలేదు.

విశాఖలోని వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండాను రివర్స్‌లో ఎగురవేయడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ నాయకులకు రివర్స్‌లో వెళ్లడం కామన్ అని.. జాతీయ పతాకాన్ని సైతం అలా ఆవిష్కరించడం తగదని సెటైర్లు వినిపిస్తున్నాయి. తాను జెండాను తలకిందులుగా ఎగురవేసిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన మంత్రి అవంతి శ్రీనివాస్.. ఆ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కార్యాలయ సిబ్బందిపై అసహనం వ్యక్తంచేశారు. రివర్స్‌లో ఎగురుతున్న పతాకాన్ని అవనతం చేసి.. సరిదిద్ది మళ్లీ ఆవిష్కరించారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close