ఇంట్లో అబ్బాయిలా.. వీధిలో అమ్మాయిలా.. ఎందుకో తెలిస్తే..

Read Time:0 Second

Raja
నేను చేసేది తప్పు కాదు.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేస్తున్నాను. అమ్మాయిగా ఉంటే నాలుగిళ్లలో అంట్లు తోముకోవచ్చు.. నాలుగు డబ్బులు సంపాదించవచ్చు. దాంతో అమ్మానాన్నని పోషించుకోవచ్చనే ఈ వేషం వేస్తున్నాను. ఏం.. అబ్బాయిలు చేసే పన్లేవీ దొరకలేదా.. ఏదైనా హోటల్లో కప్పులు కడిగినా, సర్వర్‌గా ఉన్నా ఎంతో కొంత ఇస్తారుగా అంటే.. అవి సరిపోవు.. అదీ కాక ఉదయం నుంచి సాయింత్రం దాకా డ్యూటీ పేరుతో అక్కడే ఉండాలి. ఈ పనైతే నాలుగ్గంటల్లో పూర్తి చేసుకోవచ్చు. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులను చూసుకోవచ్చు అని చెబుతున్నాడు తమిళనాడు మధురైకి చెందిన ఓ యువకుడు.

తల్లిదండ్రులకి చాలా కాలానికి పుట్టిన ఒకే ఒక్క కొడుకు. పెరిగి పెద్దయ్యేసరికే అమ్మానాన్న పెద్దవాళ్లైపోయారు. ఏదో ఒక పని చేసి అమ్మానాన్నని పోషించాలనుకున్నాడు. తనకు అమ్మాయిలా డ్రెస్ చేసుకోవడం ఇష్టం.. ఆ ఇష్టానే బ్రతుకుదెరువుగా మార్చుకోవాలనుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకునే వెళతాడు. దారి మద్యలో వేసుకున్న బట్టలు మార్చి చీర, జాకెట్ వేసుకుంటాడు. నుదుటన బొట్టు, జడ అచ్చంగా అమ్మాయిలా రెడీ అవుతాడు.

అచ్చంగా ఆమెలా ఉన్న అతడిని గుర్తు పట్టడం కూడా కష్టం. యజమాని చెప్పిన పని చేసి ఏ రిమార్కు లేకుండా బయటకు వస్తాడు. రోజూ ఇదే పని. అయితే ఉన్న ఊర్లో అయితే గుర్తు పడతారని పొరుగూరు వెళ్తాడు పని కోసమని. ఇది గమనించిన కొందరు గ్రామస్తులు అనుమానంతో అతడిని నిలదీశారు. దీంతో అసలు విషయం వాళ్లకు చెప్పాడు. తన పేరు రాజా అని రాజాత్తిగా పేరు మార్చుకుని ఇళ్లలో పని చేస్తున్నానని చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదని వాపోయాడు. నావల్ల ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు ఇంతవరకు. ఏదో ఒకరోజు నా విషయం బయట పడ్డా నన్ను మన్నిస్తారనే అనుకుంటున్నాను అని రాజా చెప్పుకొచ్చాడు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close