దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే మీకు తెలుసు – చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆపేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విశాఖలో పార్టీ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్‌ టెండర్‌ పేరుతో పోలవరం నిలిచిపోయిందన్నారు. గ్రామ సచివాలయాలకు వాళ్ల పార్టీ కలర్‌ వేశారని, ఇక స్మశానాలకు కూడా పార్టీ రంగులేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలుసా.. దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే తెలుసని ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు.

TV5 News

Next Post

ఏపీలో మరో పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

Thu Oct 10 , 2019
ఆంధ్రప్రదేశ్‌లో ‘YSR కంటి వెలుగు’ పథకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అనంతపురంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. మూడేళ్లపాటు 6 విడతలుగా రాష్ట్రంలోని 5 కోట్ల 40 లక్షల మందికి నేత్ర పరీక్షలు చేస్తామని చెప్పారు. తొలిదశలో 70లక్షల మంది విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు చేయనున్నారు. అవసరమైన వారికి తదుపరి చికిత్సలు, కళ్లద్దాలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కంటి పరీక్షల కిట్లు […]