ఇసుక వారోత్సవాలు ముగుస్తున్నా.. ఇసుక మాత్రం లేదు: బాబు

ba

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న మూడు రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న ఏపీని నాశనం చేశారని విమర్శించారు. అమరావతి రాకూడదనే ఉద్దేశంతో కమిటీలపై కమిటీలు వేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. జగన్ వ్యవహారశైలి వల్ల అమరావతిని కోల్పోయామంటూ మండిపడ్డారు. రెండురోజుల పర్యటనలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇసుక వారోత్సవాలు గురువారంతో ముగుస్తున్నప్పటికీ.. ఎక్కడా ఇసుక దొరకడం లేదని ఆరోపించారు. ఇసుక మాఫియాను ఎందుకు అరికట్టలేకపోతున్నారని నిలదీశారు. ఏపీ ఇసుక ఇతర రాష్ట్రాల్లో దొరుకుతుంది.. గానీ రాష్ట్రంలోని ప్రజలకు మాత్రం లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TV5 News

Next Post

ఘనంగా ప్రారంభమైన IFFI వేడుకలు

Wed Nov 20 , 2019
  50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు గోవాలో కలర్‌ఫుల్‌గా ప్రారంభమయ్యాయి. ఈనెల 28 వరకు జరిగే ఈ ఫిల్మోత్సవ్‌ను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రారంభించారు. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును ప్రదానం చేశారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా హాజరయ్యారు. IFFI లో తొలిసారి కొంకణి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన 190కి […]