బండ్ల గణేష్‌, పీవీపీ మధ్య వార్.. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

బండ్ల గణేష్‌, పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ) మధ్య ఆర్థిక వివాదం నెలకొంది. పోలీస్‌ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. బండ్ల గణేష్‌ తనకు 7 కోట్లు ఇవ్వాలని అడిగితే.. బెదిరింపులకు దిగుతున్నాడని పీవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బండ్ల గణేష్‌, అతని అనుచరులు శనివారం అర్థరాత్రి తన ఇంటికి వచ్చి.. హల్‌చల్‌ చేశారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దీంతో బండ్ల గణేష్‌, అతని అనుచరులపై 448, 506, 420 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. అటు పీవీపీ, ఆయన అనుచరులు డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్‌ పీఎస్‌లో పోటీగా ఫిర్యాదు చేశారు బండ్ల గణేష్‌.

TV5 News

Next Post

ప్రేమలో పడ్డ అఖిల్ భామ.. అతడితోనే..

Sat Oct 5 , 2019
ప్రముఖ తమిళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్, అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో చిత్రంలో నటించింది. సాయిధరమ్ తేజతో చిత్రలహరి సినిమాలో మరోసారి కనిపించింది. ఇదిలా ఉండగా కళ్యాణి మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారట. ఈ విషయంపై కళ్యాణి స్పందిస్తూ.. ప్రేమ, డేటింగ్ మాట నిజమే కానీ.. అతను ఎవరనేది మాత్రం చెప్పను. అతనితో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. […]