పింక్ బాల్ టెస్ట్: 106 పరుగులకు బంగ్లా ఆలౌట్

isanth

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. భారత పేసర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే బంగ్లా చాప చుట్టేసింది. భారత్‌ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్‌ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. ప్రధానంగా ఇషాంత్‌ శర్మ ఐదు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా, ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించాడు. మహ్మద్‌ షమీకి రెండు వికెట్లు లభించాయి. ఇషాంత్‌ వేసిన ఫుల్‌ లెంగ్త్‌, స్వింగ్‌ బంతులకు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ బెంబేలెత్తిపోయారు. ఇది ఇషాంత్‌కు టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్లు మార్కు కాగా, భారత్‌లో రెండోసారి.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌-ఇమ్రుల్‌ కేయిస్‌లు ప్రారంభించారు. బంగ్లా 15 పరుగుల వద్ద ఉండగా ఇమ్రుల్‌ తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇమ్రుల్‌ను ఇషాంత్‌ శర్మ ఎల్బీగా ఔట్‌ చేశాడు. ఆపై కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌, మహ్మద్‌ మిథున్‌, ముష్పికర్‌ రహీమ్‌లు డకౌట్లుగా పెవిలియన్‌ చేరారు. మోమినుల్‌, మిథున్‌లను ఉమేశ్‌ యాదవ్‌ ఔట్‌ చేయగా, రహీమ్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. మూడు బంతుల వ్యవధిలో ఉమేశ్‌ రెండు వికెట్లు తీసి బంగ్లాను గట్టిదెబ్బ కొట్టాడు.

ఇటు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే దెబ్బ తెగిలింది. గత టెస్టులో డబుల్‌ సెంచరీతో సత్తా చాటిని మయాంక్‌ అగర్వాల్‌ ఆరంభంలోనే ఔటయ్యాడు.

TV5 News

Next Post

వైసీపీ రంగులు వేయడానికి పోలీస్ స్టేషన్లే మిగిలున్నాయి: నారా లోకేష్

Fri Nov 22 , 2019
  ఏపీలో రాక్షస పాలన కొనసాగుతుందంటూ ఘాటు విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్‌ని సూసైడ్ ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో స్మశానాలకు రంగులు వెయ్యడం పూర్తి అయ్యిందని.. ఇక పోలీస్ స్టేషన్లే మిగిలున్నాయని అన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. వైసీపీ […]