సెమీస్‌పై ఆశలు పెంచుకున్న బంగ్లాదేశ్

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ మరో విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో గెలిచింది. సెమీస్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు 262 పరుగులు చేసింది. షకీబుల్, ముష్ఫికర్‌ రహీమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఛేజింగ్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. షకీబుల్ బంతితోనూ చెలరేగి ఐదు వికెట్లు పడగొట్టడంతో ఆప్ఘనిస్థాన్ 200 పరుగులకే ఆలౌటైంది. ఏడు మ్యాచ్‌లలో 3 విజయాలు సాధించిన బంగ్లా సెమీస్‌ ఆశలు నిలుపుకుంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఇప్పటి వరకూ వరల్డ్‌కప్ గెలవని ఆ జట్టుపైనే ఆశలు..!

Tue Jun 25 , 2019
ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లు ఇప్పుడు రసవత్తరంగా మారాయి. వర్షాలతో డీలా పడ్డ జట్లు అనూహ్య పోరాటాలతో సంచలనాలు సృష్టిస్తున్నాయి. నాకౌట్‌ దశ సమీపిస్తుండటంతో తొలి నాలుగు స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్‌పైనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ప్రపంచకప్ టైటిల్ రేసులో ఉన్న ఇంగ్లాండ్‌పై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. క్రికెట్‌ పుట్టినిల్లయిన ఆ జట్టు ఇప్పటి వరకూ […]