గుడ్‌న్యూస్.. ఇకపై మీ భాషలోనే బ్యాంకు పరీక్ష..

ఇంగ్లీష్ రాదు.. హిందీ అర్థం కాదు.. బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే పరీక్షా పత్రం హిందీ, ఇంగ్లీషుల్లో ఉంటుందని చింతించాల్సిన అవసరం లేదు. ఇకపై బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. బ్యాంకు పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే బ్యాంకు పరీక్షలు రాసే అవకాశం ఉంది. దీని వలన ప్రాంతీయ భాషల్లో చదువుకున్న వారికి పరీక్ష రాయడం కష్టంగా మారిందని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఇంగ్లీషు భాషపై పట్టు తక్కువగా ఉండడంతో ప్రశ్నా పత్రం సరిగా అర్థం కాక కొందరు అభ్యర్థులు విఫలమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి మరింత ఇబ్బంది. తాజా నిర్ణయంతో ఈ అభ్యర్థులకు మేలు జరుగుతుంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు : నారా లోకేష్

Thu Jul 4 , 2019
ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి ధ్వజమెత్తారు నారా లోకేష్. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చెయద్దన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతుల సందర్భంగా చంద్రబాబుగారిపై యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో జరిగిన దానిని వక్రీకరిస్తూ..నాకు అబద్దాలు చెప్పడం అలవాటే అని చంద్రబాబు ఒప్పుకున్నట్లు చెప్పారంటూ జగన్ పై ఫైరయ్యారు లోకేష్. చంద్రబాబుగారిమీద జోకులు వేయబోయి.. […]