బ్యాంక్‌ క్యాషియర్‌ చేతివాటం.. రూ. 25 లక్షల నగదు కొట్టేసి..

పనిచేస్తున్న బ్యాంక్‌లోనే క్యాషియర్‌ చేతివాటం చూపించిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా క్యాషియర్‌ గొడవర్తి శ్రీనివాసరావు చేతికి అందినకాడికి దోచుకున్నాడు. ఖాతాదారులకు భరోసా ఇవ్వాల్సిన క్యాషియర్ బ్యాంకులోని బంగారాన్ని, నగదును సొంత అవసరాలకు వాడుకున్నాడు.

ఓ రైతు తాకట్టుపెట్టిన బంగారాన్ని ఒకలోనులో చూపించి.. మళ్లీ అదే బంగారాన్ని మరో అకౌంట్‌ ద్వారా చూపించి ఇంకో లోన్‌ తీసుకున్నాడు క్యాషియర్‌ శ్రీనివాసరావు . ఇలా అకౌంట్లు గోల్‌మాల్‌ చేసి సొంత ఖర్చులకు వాడేసుకున్నాడు‌. సొంత బ్రాంచి ఉద్యోగి చేతివాటానికి ఉన్నాతాధికారులు షాక్‌కు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు 2 కిలోల 2 వందల గ్రాముల బంగారం, 25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి.. కాలిపోయిన యువకుడి ముఖం

Sun Jul 7 , 2019
పుట్టిన రోజు వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. సరదా కోసం వేడుకల్లో స్నో స్ప్రే కారణంగా పుట్టిన రోజు జరుపుకుంటున్న యువకుడి ముఖమంతా కాలిపోయింది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఈఘటన చోటు చేసుకుంది. యువకుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.మండపేట కలవపువ్వు సెంటర్‌లో స్నేహితులతో కలిసి యువకుడు బర్త్ డే కేక్‌ క్యాండిల్ వెలిగించాడు. తోటి స్నేహితులు సరదాగా ఆ యవకుడి తలపై స్ప్రే చల్లారు. ఎక్కువగా చల్లడంతో క్యాండిల్ […]