కొత్త ఇల్లు కొనుగోలు చేసిన బరాక్ ఒబామా

Read Time:0 Second

obama

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కొత్త ఇల్లును కొనుగోలు చేశాడు… అయితే ఇందులో ప్రత్యేక ఏముంది అనుకుంటారేమో… ఆ ఇళ్లు అలాంటి ఇలాంటి ఇళ్లుకాదు… అందమైన దీవిలో సుందరమైన సువిశాలమైన భవనం.. మసాచుసెట్స్ రాష్ట్రంలోని మార్తాస్ వినియార్డ్ దీవిపై నిర్మించిన ఇంటిని తీసుకున్నారు. 29 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో ఏడు పడుకగదులు, తొమ్మిది బాత్ రూములు, రెండు అతిథి రూములు,అధునాతన కిచెన్ తో పాటు, స్విమ్మింగ్ ఫూల్, ప్రైవేట్ బీచ్, బోట్ హౌజ్ ఎంతో అందంగా ఉంది. చుట్టు పచ్చనిచెట్లు..మధ్యలో ఈ భవనాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. వేసవి విడిదికోసం అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే ఒబామా కుటుంబానికి ఇది బాగా నచ్చడంతో దీన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close