బూటు కాలుతో తంతూ యువకులను హింసించిన..

బెంగళూరులో దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై ఓ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎండీ రాక్షసంగా ప్రవర్తించాడు. బూటు కాలుతో తంతూ యువకులను దారుణంగా హింసించాడు సెక్యూరిటీ ఫోర్స్‌ ఎండీ సలీం ఖాన్‌. బాధితులు వద్దని వేడుకున్నా కనికరించలేదు. ఆర్తనాదాలు పెడుతున్నా విన్లేదు. మరింత కర్కశంగా వ్యవహరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ ఫోర్స్ ఎండీ.. ఎందుకంత రాక్షశంగా వ్యవహరించాడు. ఆ యువకులు ఎవరనే కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

TV5 News

Next Post

రసాభాసగా మారిన రైతు భరోసా కార్యక్రమం

Tue Oct 15 , 2019
తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పరిధిలోని శివకోటి గ్రామంలో రైతు భరోసా కార్యక్రమం రసాభాసగా మారింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌ రాకుండానే వైసీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభించారు. అయితే కాసేపటికే సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యే రాపాక.. అధికారులు, వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్‌ పాటించకపోవడంపై నిలదీశారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య […]