కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

మహారాష్ట్రలోని భివాండిలో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అక్రమంగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనానికి పగుళ్లు రావడంతో.. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తమై.. దాంట్లో నివాసముంటున్న 22 కుటుంబాలను రాత్రి ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది.

అయితే తమ నివాసాల్లో కొన్ని వస్తువులు మరిచిపోయామని, అవి తీసుకువస్తామని ఐదుగురు వ్యక్తులు భవనంలోకి వెళ్లారు. ఈ సమయంలోనే భవనం కుప్పకూలిపోయింది. అనంతరం శిథిలాలను తొలగించి ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ భవనాన్ని ఎనిమిదేళ్ల క్రితం నిర్మించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story